/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Neelam-Madhu-jpg.webp)
బీఆర్ఎస్ పార్టీకి (BRS Party) మరో బిగ్ షాక్ తగిలింది. పటాన్ చెరు టికెట్ కోసం నిన్నటి వరకు వేచి చూసిన నీలం మధు ముదిరాజ్ (Neelam Madhu) ఈ రోజు పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ కోసం నీలం మధు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే.. సిటింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికే మరో సారి టికెట్ దక్కడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మార్చుకుని తనకే బీఫామ్ ఇస్తారని ఆయన ఆశించారు. అయితే.. నిన్న మహిపాల్ రెడ్డికి సీఎం కేసీఆర్ పార్టీ బీఫామ్ అందించారు. దీంతో పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు నీలం మధు. టికెట్ ఇస్తానని హామీ ఇస్తే కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ పార్టీలో ఆయన చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు పటాన్ చెరు టికెట్ ను ప్రకటించలేదు. దీంతో నీలం మధు ఆ పార్టీలో చేరి టికెట్ దక్కించుకునే ఛాన్స్ ఉందన్న ప్రచారం సాగుతోంది.
ఇది కూడా చదవండి: TS Politics: కాంగ్రెస్ కు జిట్టా బాలకృష్ణారెడ్డి షాక్.. నేడు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లోకి?
పార్టీకి రాజీనామా చేసిన సమయంలో నీలం మధు మాట్లాడుతూ.. 22 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీకి సైనికుడిలా సేవలందించానని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో పటాన్ చెరు జడ్పీటీసీగా పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో తాను పోటీ చేశానని గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: Telangana Politics: రంగంలోకి తుమ్ముల, పొంగులేటి.. బీఆర్ఎస్ కు కీలక నేత షాక్.. కాంగ్రెస్ లోకి?
బీఆర్ఎస్కు నీలం మధు గుడ్ బై...
Neelam Madhu Mudiraj Resign To BRS Party...#neelammadhu #neelammadhumudiraj #brsparty #resign #telangana #politics #elections #elections2023 pic.twitter.com/hbY8OV8ta7— RTV (@RTVnewsnetwork) October 16, 2023
2014, 18లో పార్టీ పటాన్ చెరులో గెలుపొందడానికి తన అలుపెరుగని కృషి ఉందన్నారు. తన ఆస్తులను అమ్మి పార్టీ కోసం ఖర్చు పెట్టానన్నారు నీలం మధు. ప్రస్తుత ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తనపై అనేక అక్రమ కేసులు పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం తాను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా చింపివేశారన్నారు. ఇక నుంచి ప్రజలే తన అధిష్టానం అని స్పష్టం చేశారు నీలం మధు.