Indians : అమెరికా పౌరులుగా రికార్డు సృష్టించిన భారతీయులు! భారతీయులు రికార్డు స్థాయిలో అమెరికా పౌరసత్వం పొందుతున్నారు. అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల్లో భారతీయులు అత్యధికంగా నమోదు అయ్యి..రెండో స్థానంలో నిలిచారు.అమెరికా సెన్సస్ బ్యూరో వెల్లడించిన వివరాల ప్రకారం, 2022లో 65,960 మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారు By Bhavana 22 Apr 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి Indians Are Become Americans : భారతీయులు(Indians) రికార్డు స్థాయిలో అమెరికా(America) పౌరసత్వం పొందుతున్నారు. అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల్లో భారతీయులు అత్యధికంగా నమోదు అయ్యి.. రెండో స్థానంలో నిలిచారు. మొదటి స్థానాన్ని మెక్సికో పౌరులు అందుకున్నారు. అమెరికా సెన్సస్ బ్యూరో వెల్లడించిన వివరాల ప్రకారం, 2022లో 128,878 మంది మెక్సికన్లు అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. 65,960 మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారు. ఆ తరువాత స్థానాల్లో ఫిలిప్పీన్స్, క్యూబా, డోమినికన్ రిపబ్లిక్, వియత్నాం, చైనీయులు చేరారు. అధికారిక లెక్కల ప్రకారం, 2022లో అమెరికాలో ఉంటున్న మొత్తం విదేశీయుల సంఖ్య 46 మిలియన్లు. దేశ జనాభాలో వీరి వాటా 14 శాతం. అమెరికాలోని విదేశీయుల్లో దాదాపు 53 శాతం మంది తమకు అమెరికా పౌరసత్వం ఉన్నట్టు వివరించారు. ఇక 2022లో మొత్తం 969,380 మంది అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. ఇక 2023 లెక్కల ప్రకారం, విదేశాల్లో పుట్టి అమెరికా పౌరసత్వం పొందిన మొత్తం భారతీయుల సంఖ్య 2,831,330. అమెరికా పౌరసత్వం ఉన్న విదేశీయుల్లో మెక్సికన్లు (10,638,429 మంది) తొలిస్థానంలో నిలవగా భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. అయితే, విదేశాల్లో పుట్టి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న వారిలో 42 శాతం మందికి అమెరికా పౌరులయ్యే అర్హత లేదని ఈ నివేదికలో వెల్లడయ్యింది. ఇక గ్రీన్ కార్డు(Green Card) ఉన్న 290,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం పొందే అర్హత ఉందని ప్రభుత్వ గణాంకాలు తేల్చాయి. Also read: మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు! #america #indians #citizenship మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి