Best PM : ఎన్నికలు ఏవైనా కావచ్చు..సర్వేలు మాత్రం పక్కగా ఉంటాయి. సర్వేల ఫలితాలు కూడా తారుమారైన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు దేశంలో ఎన్నికల వాతావరణం హాట్ హాట్ గా ఉంది. కొన్ని రోజుల్లోనే లోకసభ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ తరుణంలో పలు జాతీయ మీడియా ఛానెళ్లు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈసారి లోకసభ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు?మళ్లీ మోదీనే గెలిపించి హ్యాట్రిక్ కొట్టిస్తారా?ఇండియా కూటమిని అక్కున చేర్చుకుంటారా? ఈ సారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? చూద్దాం.
ప్రముఖ న్యూస్ వెబ్ సైట్ న్యూస్ 18 నిర్వహించిన మెగా పోల్ లో తదుపరి ప్రధానమంత్రిగా ఎవరు ఎక్కువ అర్హత కలిగి ఉన్నారనే ప్రశ్నకు 59 శాతం మంది నరేంద్ర మోదీకి, 21 శాతం మంది రాహుల్ గాంధీకి, 9 శాతం మంది మమతా బెనర్జీకి, 9 శాతం మంది అరవింద్ కేజ్రీవాల్‌కు ఓటు వేశారు.మొత్తం 21 రాష్ట్రాల్లో 518 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ సర్వేను నిర్వహించారు. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 1 వరకు దేశవ్యాప్తంగా 1,18,616 మంది ప్రజల అభిప్రాయాన్నితెలుసుకున్నారు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అనే విషాయాన్ని అంచనా వేశారు. ఎన్డీయేకు బీహార్లో అత్యధిక స్థానాలు వస్తాయని తేలింది. జేడీయూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అక్కడ దాదాపుగా క్లీన్ స్వీప్ చేస్తుందని అక్కడి ప్రజల నాడీ తెలిపింది.
అయితే కేరళలో మాత్రం ఎన్డీయేకు షాక్ తగులుతుందని సర్వే పేర్కొంది. ఇండియా కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని సర్వేలో తేలింది. ఎన్డీయేకు కేవలం రెండు సీట్లు మాత్రమే వస్తాయట. కేరళలో మొత్తం 20 ఎంపీ సీట్లు ఉండగా అందులో కాంగ్రెస్ కూటమికి 14, ఎన్డీయే కూటమికి రెండు సీట్లు.. ఇతరులు 4 సీట్లలో విజయం సాధిస్తారని సర్వే తెలిపింది. కాంగ్రెస్ కూటమికి 47శాతం, ఎల్డీఎఫ్‌కు 32శాతం, ఎన్డీయేకు 18 శాతం ఓట్లు పడొచ్చని సర్వేల్లో వెల్లడైంది. తమిళనాడులోనూ ఇండియా కూటమి హవా కొనసాగుతుందని సర్వేలో తేలింది. తమిళనాడులో మొత్తం 39 స్థానాలుంటే.. అందులో డీఎంకే కూటమికి 30 సీట్లు వస్తే...ఎన్డీయే కూటమికి కేవలం 5 సీట్లు వస్తాయని తెలిపింది. ఇతరులకు 4 స్థానాలు వస్తాయట.
అటు మధ్యప్రదేశ్ లో మాత్రం బీజేపీకి దూకుడుకు ఇండియా కూటమి ఢీలా పడటం ఖాయమని తెలిపింది. దాదాపుగా క్లీన్ స్వీప్ చేస్తుందట. మధ్యప్రదేశ్‌లో మొత్తం 39 స్థానాలుంటే.. 38 చోట్ల బీజేపీ భారీ విజయం సాధిస్తుందని తెలిపింది. ఒకే ఒక్క చోట మాత్రమే కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేసింది. హర్యానాలోనూ బీజేపీ పవనాలే వీస్తున్నాయి. 10కి 10 సీట్లు ఎన్డీఏ ఖాతాలో పడతాయని తెలిపింది. బీజేపీకి మద్దతుగా 62శాతం మంది ఉంటే, కాంగ్రెస్‌కు 29 శాతం మంది మాత్రమే అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది.
ఇక ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌ను ఎన్డీయే హవా కొనసాగుతుందని సర్వేలో తేలింది. హిమాచల్‌లో 4కు 4, ఢిల్లీలో 7కు 7 చోట్ల బీజేపీ కూటమి విజయం సాధిస్తుందట. హిమాచల్‌లో 67శాతం మంది బీజేపీ వైపు ఉంటే, 27శాతం మంది కాంగ్రెస్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఢిల్లీలో 58శాతం ఎన్డీయే, 26 శాతం మంది కాంగ్రెస్, 17 శాతం మంది ఇతరుల వైపు ఉన్నారని సర్వేలో తేలింది.