NCERT సంచలన నిర్ణయం.. ఇకపై బుక్స్‌లో 'ఇండియా' పేరు ఉండదు..!

ఇటీవల కాలంలో దేశం పేరు మార్పు అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. NCERT తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం సంచలనంగా మారింది. పాఠ్యపుస్తకాల్లో ఇకపై 'ఇండియా' అనే పేరు ఉండదు. Indiaకి బదులుగా 'భారత్‌' పేరును ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది. కొత్తగా ప్రింట్‌ కానున్న NCERT బుక్స్‌లో 'ఇండియా' ప్లేస్‌లో 'భారత్‌' పేరు ఉండనుంది.

NCERT సంచలన నిర్ణయం.. ఇకపై బుక్స్‌లో 'ఇండియా' పేరు ఉండదు..!
New Update

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) కీలక నిర్ణయం తీసుకుంది. 'ఇండియా' అనే పేరుకు బదులుగా 'భారత్‌' అనే పేరును బుక్స్‌లో ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ఈ మెరకు ప్యానెల్‌ ప్రదిపాదనను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. కొత్తగా రానున్న NCERT పుస్తకాలు 'ఇండియా' ప్లేస్‌లో 'భారత్‌'ను కలిగి ఉంటాయి. ఏడుగురు సభ్యుల కమిటీ ఏకగ్రీవంగా ఈ సిఫార్సు చేసిందని కమిటీ చైర్‌పర్సన్ సీఐ ఐజాక్ తెలిపారు. ఇక ఛాప్టర్స్‌లో కూడా మార్పులు చేయాలని కూడా డిసిషన్‌ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పాఠ్యాంశాల నుంచి 'ప్రాచీన చరిత్ర'ను తొలగించి.. దాని స్థానంలో 'క్లాసికల్ హిస్టరీ'ని బోధించాలని మరొక సిఫార్సు చేశారు.


'ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌..'
ఈ ఏడాది జీ20 సమావేశాల్లో తొలిసారి పేర్పు వ్యవహారం తెరపైకి వచ్చింది. గత సెప్టెంబర్‌ 9, 10 జరిగిన జీ20 సమావేశాలకు ముందు భారత్‌ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన డిన్నర్‌ ఇన్‌విటేషన్‌లో ఇండియా అనే పేరుకు బదులుగా 'భారత్‌' అనే పదాన్ని వాడారు. 'ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా..' అని ఉండాల్సిన చోట 'ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌' అనే పేరును ఉపయోగించడం సంచలనం రేపింది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరిగిన జీ20 లీడర్స్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నప్పుడు టేబుల్‌పై 'భారత్' నేమ్‌ప్లేట్ కనిపించింది. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ఈ విషయంలో మాటల యుద్ధం జరిగింది. గత నెల 19 నుంచి జరిగిన ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ పేరు మార్పుపై కేంద్రం ఒక బిల్లు కూడా ప్రవేశపెట్టనుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమి జరగలేదు కానీ.. అప్పటినుంచి దేశంలో ఈ ఇండియా వర్సెస్‌ భారత్‌ అంటూ ప్రజల్లో చర్చ మొదలైంది. ఇటు సోషల్‌మీడియాలోనూ 'ఇండియా' అనే పేరుకు వ్యతిరేకంగా బీజేపీ మద్దతుదారులు క్యాంపెయిన్ చేస్తున్నారు.

రాజ్యాంగంలో ఏం ఉందంటే?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 1(1) మన దేశం పేరును 'ఇండియా, అంటే భారత్ రాష్ట్రాల యూనియన్‌గా ఉండాలి' అని రాసి ఉంది. అంటే మన దేశం పేరు రాజ్యాంగం ప్రకారం ఇండియాతో పాటు భారత్ కూడా. అంతేకానీ ఒక్కటే పేరు కాదు. అయితే అసలు పూర్తిగా ఇండియా అనే పేరును రాజ్యాంగం నుంచి తొలగించాలని బీజేపీ అడుగులు వేస్తున్నట్టుగా ఉందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. వారి ఆరోపణలకు బలం చేకూరేలాగే ప్రస్తుత పరిణామాలు జరుగుతున్నాయంటున్నారు విశ్లేషకులు.

Also Read: గాజాలో మరణాలు ఆందోళనకరంగా ఉన్నాయి-ఐరాసలో భారత్

#ncert #india-vs-bharat
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe