NBK109 : బాలయ్య బర్త్ డే ట్రీట్.. 'NBK 109' నుంచి ఫైరింగ్ అప్డేట్, ఏంటో తెలుసా?

జూన్ 10 బాలయ్య బర్త్ డే ఉంది. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న NBK109 మూవీ నుంచి ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు మూవీ టీమ్. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ NBK109 అప్డేట్ అంటూ వేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతుంది.

New Update
NBK109 : బాలయ్య బర్త్ డే ట్రీట్.. 'NBK 109' నుంచి ఫైరింగ్ అప్డేట్, ఏంటో తెలుసా?

Firing Update From NBK109 : నందమూరి నటసింహం బాలయ్య వరుస హిట్లతో ఊపు మీద ఉన్నారు. గతేడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, దసరాకు భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. ఇదే జోష్ తో మరో బ్లాక్ బస్టర్ కాంబోను లైన్ లో పెట్టారు బాలయ్య.

బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ 'NBK 109'. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన పోస్టర్, ప్రమోషనల్ కంటెంట్ మూవీ అంచనాలను పెంచుతున్నాయి. మహాశివరాత్రి కానుకగా రిలీజ్ చేరిన ‘NBK 109’ గ్లింప్స్ మూవీ పై మరింత హైప్ క్రియేట్ చేసింది.

Also Read : గ్రాండ్ గా ‘కల్కి’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్టులుగా ఆ ఇద్దరు బడా స్టార్స్?

బాలయ్య బర్త్ డే ట్రీట్... 

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ మ‌రో స‌ర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. బాల‌య్య పుట్టిన రోజు (జూన్ 10న) సంద‌ర్భంగా ఓ సాలీడ్ అప్‌డేట్‌ను ఇవ్వ‌నున్నారు. దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ థ‌మ‌న్ నిన్న రాత్రే ఫైరింగ్ ట్వీట్ ఇవ్వ‌నున్న‌ట్లు ట్వీట్ చేయ‌గా.. ఈ ఉద‌యం ద‌ర్శ‌కుడు బాబీ ఇదే త‌ర‌హాలో ఓ పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫైరింగ్ అప్‌డేట్ ఏంటా? అని అభిమానులు ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.బాలయ్య బర్త్ డే రోజున సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు