వరద బాధితులకు సాయం చేసిన నయన్‌..తిట్టిపోస్తున్న జనం..ఎందుకంటే!

చెన్నై లో మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార వరద సాయం చేసింది. కానీ ఆమె చేసిన పనికి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఎందుకంటే తన సంస్థ అయిన ఫెమీ 9 ని ఈ సందర్భంగా ఆమె ప్రమోట్‌ చేసుకుందని విమర్శలు కురిపిస్తున్నారు.

వరద బాధితులకు సాయం చేసిన నయన్‌..తిట్టిపోస్తున్న జనం..ఎందుకంటే!
New Update

మిచౌంగ్ తుఫాన్‌ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా ఎంత బీభత్సం సృష్టించిందో తెలిసిందే. చాలా ప్రాంతాలు ఇప్పటికే నీటిలోనే నానుతున్నాయి. వరదల వల్ల ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది ఎంతో మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజలు కొంచెం బయటకు వస్తున్నారు. వరదల వల్ల చాలా మంది గూడు కోల్పోయి రోడ్డున పడ్డారు. సాయం కోసం పునరావాస కేంద్రాల్లో చాలా మంది ఎదురు చూస్తున్నారు. గవర్నమెంట్‌ అధికారులు ఎంత సహాయక చర్యలు చేపట్టినా కూడా ఇంకా చాలా మందికి అందాల్సిన సాయం అందడం లేదు.

ఈ క్రమంలో సినీ ప్రముఖులు కొందరు స్వచ్ఛందంగా నిత్యావసర వస్తువులను వరద బాధితులకు అందజేస్తున్నారు. వారి అభిమానులను కూడా తమకు తోచిన సాయం అందించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే సౌత్‌ ఇండియన్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార కూడా తన వంతుగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంది.

తన సంస్థ అయినటువంటి ఫెమీ 9 ఆధ్వర్యంలో చెన్నై వేలచ్చేరి కైవేలి బ్రిడ్జి సమీపంలోని ప్రాంతాల్లో వరద బాధితులకు కొన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. దీంతో నయన తార పై నెటిజన్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే కొందరు నెటిజన్లు మాత్రం నయన్‌ చేసిన పనిని విమర్శిస్తున్నారు.

అది ఏంటి మంచి చేసిన ఎందుకు విమర్శిస్తున్నారు..అసలు నయన్‌ చేసిన తప్పు ఏంటి అనుకుంటున్నారా? . అసలు నయన్‌ ఏం చేసింది అంటే. తన సంస్థ అయిన ఫెమీ 9 కి చెందిన యాడ్‌ బోర్డులు ఉన్న స్పెషల్‌ బండిలో వరద బాధితులకు సాయం అందించడమే నయన్‌ చేసిన తప్పు.

దీంతో నయన్‌ పై విమర్శలు కురిపిస్తున్నారు. నయన్‌ సాయం చేస్తున్న సమయంలో ఉన్న వీడియోను ఫెమీ 9 తన అధికారిక సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. వీడియో చివరిలో స్థానిక మహిళలు కొందరు నయనతారకు కృతజ్ఙతలు తెలిపారు. ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్‌ గా మారింది.

దీనిని చూసిన కొందరు మహిళలను పెట్టి కావాలని వీడియో షూట్‌ చేసి చిత్రీకరించారని విమర్శిస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా మీకు కంపెనీ ప్రమోషన్స్‌ కావాల్సి వచ్చిందా అంటూ నయన్‌ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Also read: దేశంలో 12.5శాతం పెరిగిన గుండెపోటు మరణాలు..NCRB రిపోర్టులో షాకింగ్ విషయాలు..!!

#chennai #nayanatara #michaung #femi9 #critisezes
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe