Breaking: కుప్పకూలిన నేవీ హెలికాఫ్టర్‌..అధికారి మృతి!

భారత నావికాదళానికి చెందిన చేతక్‌ హెలికాఫ్టర్‌ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఓ నేవీ అధికారి ప్రాణాలు కోల్పోయారు

New Update
Breaking: కుప్పకూలిన నేవీ హెలికాఫ్టర్‌..అధికారి మృతి!

భారత నావికాదళానికి చెందిన చేతక్‌ హెలికాఫ్టర్‌ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఓ నేవీ అధికారి ప్రాణాలు కోల్పోయారు. శనివారం మధ్యాహ్నం కొచ్చి నేవీ హెడ్ క్వార్టర్స్ లోని ఐఎన్‌ఎస్‌ గరుడ రన్‌ వే పై ఈ ప్రమాదం జరిగింది. పైలట్‌ తో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ప్రమాదంలో చాపర్‌ రోటర్‌ బ్లేడ్లు తగిలి రన్‌ వే పై ఉన్న నౌకాదళ అధికారి మృతి చెందినట్లు సమాచారం. ఇద్దరు పైలట్లకు గాయాలైనట్లు తెలుస్తుంది. పైలట్లు ఇద్దరినీ నావికాదళ ప్రధాన కార్యాలయంలోని సంజీవని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కొచ్చి హార్బర్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Also read: ఆ గ్రామ ప్రజలు 200 ఏళ్లుగా దీపావళిని జరుపుకోవడం లేదు..ఎందుకంటే!

updated soon...

Advertisment
తాజా కథనాలు