Tollywood: యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి అమెరికాలో ప్రమాదం..తీవ్ర గాయాలు!

టాలీవుడ్ యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి అమెరికా లో ప్రమాదం జరిగింది. బైక్ నడుపుతూ జారిపడిపోవడంతో ఆయన చేతికి ఫ్యాక్చర్‌  అయినట్లు ఆయన సన్నిహితులు వివరించారు. దీంతో ఆయన రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిపారు.

New Update
Tollywood: యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి అమెరికాలో ప్రమాదం..తీవ్ర గాయాలు!

Accident : టాలీవుడ్ యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి(Naveen Polishetty)  అగ్రరాజ్యం అమెరికా(America) లో ప్రమాదం జరిగినట్లు సమాచారం.బైక్ నడుపుతూ జారిపడిపోవడంతో ఆయన చేతికి ఫ్యాక్చర్‌(Fracture)  అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోనున్నారని సన్నిహితులు వెల్లడించారు. అయితే ఏ సందర్భంలో ఆయనకు ప్రమాదం జరిగింది అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం గురించి తెలుసుకున్న ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు.

టేక్‌ కేర్ నవీన్‌(Take Care Naveen) అంటూ మెసేజ్‌ లు పెడుతున్నారు. నవీన్ పోలిశెట్టి గతేడాది మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్‌ ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా షారూక్ ఖాన్ నటించిన జవాన్‌ సినిమాతో పోటీ పడింది. అయినప్పటికీ మంచి వసూళ్లనే రాబట్టింది.

ప్రస్తుతం నవీన్‌ అనగనగ ఒక రాజు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కూడా కొంచెం జరిగింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు అయినప్పటికీ కొన్ని అనుకోని కారణాల వల్ల వెనక్కి వెళ్లింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్ అయ్యిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read : రోహిత్‌ శర్మ పై విజయ్‌ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు!

Advertisment
తాజా కథనాలు