Karnataka: కర్ణాటకలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అంగరంగ వైభవంగా నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న వరుడు.. ఉన్నట్టుండి కృరమృగంలా మారిపోయాడు. మూడు ముళ్లు వేసి మూడు గంటలైన గడవకముందే కట్టుకున్న యువతిని కాటికి పంపించాడు. కోలార్ జిల్లాకు చెందిన నవీన్ కుమార్ అనే యువకుడు పెళ్లి చేసుకున్న కొన్ని గంటలకే తన భార్య లిఖిత శ్రీ ని నరికి చంపిన ఘటన సంచలనం రేపుతోంది. 27 ఏళ్ల నవీన్ కుమార్ మొదట తన భార్య లిఖిత శ్రీ (18)ని కొడవలితో చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Murder: పెళ్లైన కొన్ని గంటలకే భార్యను నరికి చంపిన వరుడు.. తర్వాత ఏం జరిగిందంటే!
కర్ణాటకలో ఓ వరుడు దారుణానికి పాల్పడ్డాడు. బంధువుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్న నవీన్ తాళి కట్టిన కొన్ని గంటల్లోనే భార్య లిఖితశ్రీ ని కొడవలితో నరికి చంపాడు. తర్వాత తాను అదే కొడవలితో గాయపరుచుకోగా చికిత్స పొందుతూ మరణించాడు.
Translate this News: