Lubricants used For Inter Course : శృంగారం సమయంలో మీ శరీరం సహజంగా ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. లూబ్రికెంట్ అనేది సంభోగ సమయంలో స్త్రీ యోని నుంచి బయటకు వచ్చే ద్రవం. ఇది శృంగారాన్ని ఈజీ చేస్తుంది. మరింత ఆహ్లాదకరంగా మార్చుతుంది. అయితే ప్రతి ఒక్కరి శరీరం ప్రతిసారీ ఈ సహజ ద్రవాన్ని ఉత్పత్తి చేయదు. అలాంటి సమయంలో సింథటిక్ లూబ్రికెంట్లు(Synthetic Lubricants) అవసరం. శృంగారాన్ని ఈజీ చేయడానికి చాలా మంది వాసెలిన్ లేదా మాయిశ్చరైజర్‌ని ఉపయోగిస్తారు. కానీ ఇది సరైనది కాదు ఎందుకంటే శరీరం బయటి భాగాలపై వర్తించే ఉత్పత్తులు యోని లోపలికి వెళ్తాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే శృంగారాన్ని మెరుగ్గా మార్చే సింథటిక్ లూబ్రికెంట్లతో పాటు నెచురల్ లూబ్రికెంట్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
కొబ్బరి నూనె: తెలంగాణ, ఏపీలో జుట్టు సంరక్షణ కోసం విస్తృతంగా ఉపయోగించేది ఈ నూనెనే. కొబ్బరి నూనె శృంగారానికి(Inter Course) ఉపయోగపడే ప్రసిద్ధ సహజ కందెన(లూబ్రికెంట్). ఇది తేమ లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే కొబ్బరి నూనెను రబ్బరుతో చేసిన కండోమ్‌లకు అనుకూలంగా ఉండదు.
అలోవెరా జెల్: కలబంద(Aloe Vera) మాయిశ్చరైజింగ్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. అలోవెరా జెల్, మొక్క నుంచి నేరుగా తీసుకొవచ్చు లేదా మార్కెట్‌లోనూ లభ్యమవుతుంది. ఇది సహజ కందెనగా ఉపయోగపడుతుంది.
నువ్వుల నూనె: నువ్వుల నూనెను సాధారణంగా తెలంగాణ(Telangana) వంటకాలలో ఉపయోగిస్తారు. దాని ఆరోగ్య ప్రయోజనాలకు కూడా పేరు చెందింది. సహజమైన కందెనగా, నువ్వుల నూనె శృంగార సమయంలో లూబ్రికేషన్‌ను అందిస్తుంది. అయితే ఇది కూడా కొన్ని రకాల కండోమ్‌లతో ఉపయోగించడానికి తగినది కాదు.
నీటి ఆధారిత లూబ్రికెంట్లు: ఇది సహజమైనది కానప్పటికీ నీటి ఆధారిత కందెనలు ఎక్కువ రకాల కండోమ్‌లతో ఉపయోగించడానికి సురక్షితంగా ఉంటాయి. ఇవి మెడికల్ షాప్స్‌లో అందుబాటులో ఉంటాయి. అవి కండోమ్‌లకు హాని కలిగించే ప్రమాదం లేకుండా మృదుత్వాన్ని అందిస్తాయి. సున్నితమైన చర్మం లేదా కొన్ని పదార్ధాలకు అలెర్జీలు ఉన్న వ్యక్తులకు కూడా అనుకూలంగా ఉంటాయి.
ఇక గ్లిజరిన్ దాదాపు ప్రతి ఇంటిలో చూడవచ్చు. అయితే ఈ లూబ్రికెంట్‌ను నేరుగా యోనిలోకి చొప్పించితే అది ప్రమాదకరం. ఇది మహిళల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, యూటీఐల ప్రమాదాన్ని పెంచుతుంది. అటు పారాబెన్‌లు శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు కారణమయ్యే సింథటిక్ ప్రిజర్వేటివ్‌లు. ఇది మీ శరీరంలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని అనేక రెట్లు పెంచుతుంది. అందుకే ఇలాంటివి వాడవద్దు.
ముఖ్య గమనిక:
ఈ కథనం ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీన్ని RTV ధృవీకరించడంలేదు. శృంగారానికి సంబంధించి ఎలాంటి లూబ్రికెంట్లను వాడాలన్నా సంబంధిత వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
ALSO READ: హైదరాబాద్‌లో పుస్తకాల పండుగొచ్చింది
WATCH: