Rahul Gandhi: పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట..
2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈరోజు యూపీలోని సుల్తాన్‌పుర్ జిల్లా కోర్టులో రాహుల్ హాజరుకాగా.. ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.