Lok Sabha Elections Schedule: ఈ నెల 15న లోక్ సభ ఎన్నికల షెడ్యూల్?
ఈ నెల 15న ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్ సభతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు సమాచారం.
ఈ నెల 15న ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్ సభతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు సమాచారం.
ప్రభుత్వరంగ బ్యాంకులకు గోల్డ్ లోన్స్ విషయంలో కీలక సూచనలు చేసింది ఆర్థిక మంత్రిత్వ శాఖ. కొన్ని బ్యాంకులలో గోల్డ్ లోన్స్ విషయంలో అవకతవకలు జరిగాయని వెల్లడి కావడంతో ఈ సూచన వచ్చింది. ఇప్పటికే గోల్డ్ లోన్స్ అవకతవకల విషయంలో IIFL సంస్థపై ఆర్బీఐ చర్యలు తీసుకుంది.
కర్ణాటక కాంగ్రెస్ మంత్రి కేఎన్ రాజన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసేవారిని కాల్చిచంపాలంటూ ఆయన పిలుపునిచ్చారు. సయ్యద్ నసీర్ హుస్సేన్ మద్దతుదారులు అసెంబ్లీలో 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీటి కొరత కారణంగా బెంగళూరు నగరంలోని ఒక హౌసింగ్ సొసైటీ సంచలన నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ సొసైటీలో ఉన్నవారు నీరు అతిగా ఉపయోగించినా, వృథా చేసినా రూ.5వేలు జరిమాన విధిస్తామని స్పష్టం చేసింది. నీటి వృథాను పర్యవేక్షించేందుకు సెక్యూరిటీని నియమించింది.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళిక రాజకీయాల్లో స్థిరత్వం వచ్చిన తర్వాతే చమురు ధరల తగ్గింపు సాధ్యం అవుతుందన్నారు. 2021 నుంచి కేంద్రం రెండు సార్లు పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించిందని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల ముందు నాలుగు కీలక రాష్ట్రాల్లో పాత మిత్రులతో కొత్త పొత్తులు కుదుర్చుకుంది బీజేపీ. మోదీ గాలి దేశమంతా ఊపేస్తున్న వేళ బీజేపీ పొత్తుల క్రీడ వెనుక రాజకీయ వ్యూహం ఏమిటనేది పెద్ద ప్రశ్న. ఈ పొత్తులపై విశ్లేషణాత్మక కథనం టైటిల్ పై క్లిక్ చేసి చూడవచ్చు.
ఆర్ఎస్ ప్రవీణ్‌కు షాక్ తగిలింది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్-బీఎస్పీ కలిసి పోటీ చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించగా.. తాజాగా పొత్తులపై బీఎస్పీ చీఫ్ మాయావతి సంచలన ప్రకటన చేశారు. బీఎస్పీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని తేల్చి చెప్పారు. ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు చెప్పారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన 'ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్'లో ఉన్న 1,930 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మార్చి 27 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ.
ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని అన్నారు చంద్రబాబు. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేన పార్టీలకు 30 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలు ఇచ్చినట్లు టీడీపీ ముఖ్య నేతలతో చెప్పినట్లు సమాచారం. ఈ నెల 17న ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.