బీజేపీలోనే వివేక్.. లక్ష్మణ్ సంచలన ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అని బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్ అన్నారు. వివేక్ వెంకటస్వామి బీజేపీలోనే కొనసాగుతున్నారని..ఆయన మీద చేస్తున్న ప్రచారం అవాస్తవమని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అని బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్ అన్నారు. వివేక్ వెంకటస్వామి బీజేపీలోనే కొనసాగుతున్నారని..ఆయన మీద చేస్తున్న ప్రచారం అవాస్తవమని అన్నారు.
గత కొన్ని రోజులుగా ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతుంటే..అదే బాటలోకి టమాటా కూడా వచ్చి చేరుతుంది. ఉల్లి మాత్రమే వినియోగదారులను ఏడిపిస్తుందనుకుంటే ఇప్పుడు టమాటా కూడా వచ్చి చేరింది.
టెక్నాలజీ పెరుగుతోంది....దాంతో పాటూ సైబర్ నేరాలూ పెరిగిపోతున్నాయి. ఆ నేరాల్లో కూడా హద్దులు మీరిపోతున్నారు. మొన్నటివరకూ ప్రభుత్వ వెబ్ సైట్లను, ఇతర విషయాలను హ్యాక్ చేశారు. ఇప్పుడు మాత్రం ఏకంగా భారతీయుల ఆధార్ వివరాలే హ్యాక్ చేసిపడేశారు. అది కూడా 81.5 కోట్ల ఇండియన్స్ వివరాలు డార్క వెబ్ లో లీక్ అయిపోయాయి.
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కి మూడోసారి గుర్తు తెలియన వ్యక్తి నుంచి బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. రూ. 400 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని దుండగుడు మెయిల్ పంపాడు. దీంతో పోలీసులు అంబానీకి భద్రతను కట్టుదిట్టం చేశారు.
దవాఖానాలో బెడ్ లేక ఉత్తర్ ప్రదేశ్ లఖ్‌నవూకు చెందిన బీజేపీకి చెందిన మాజీ ఎంపీ బైరోన్ ప్రసాద్ మిశ్రా కుమారుడు ప్రకాశ్ మిశ్రా మృతి చెందాడు. దీంతో ఆయన మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మాజీ ఎంపీతో పాటు ఆయన బంధువులు ఆసుపత్రిలో నిరసనకు దిగారు. దీని గురించి విచారణ చేపడతామని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ షాకిచ్చింది. కేజ్రీవాల్‌కు నోటీసులు పంపిన ఈడీ నవంబర్ 2న విచారణకు హాజరవ్వాలని నోటీసులో పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీ విషయంలో ఈ విచారణ జరగనుంది. దీనికి ముందు కేజ్రీవాల్‌ను కూడా సీబీఐ విచారించింది.
యెహోవా సాక్షుల సంస్థ తన సభ్యుల మెదళ్లలో విద్వేషాలు నింపుతోందని.. దేశ భక్తిని దెబ్బతీస్తోందని నిన్న కేరళలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కు కారణమైన నిందితుడు తెలిపాడు. దాన్ని అడ్డుకోవడం కోసమే బాంబు దాడి చేశానన్నారు. అతను పోలీసులకు లొంగిపోకముందు రికార్డు చేసిన వీడియో వైరల్ గా మారింది.
మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ ని సుప్రీం కోర్టు మరోసారి తిరస్కరించింది. ఈ కేసుకి సంబంధించి విచారణను ఆరు నెలలలోపు పూర్తి చేయాలని తెలిపింది. విచారణ నెమ్మదిగా సాగితే, సిసోడియా మూడు నెలల్లోపు మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని సుప్రీం కోర్టు పేర్కొంది.
కన్వెన్షన్ సెంటర్ లో బాంబు పెట్టింది తానేనని త్రిసూర్ జిల్లాలోని కొడకరా పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి లొంగిపోయినట్లు సమాచారం. అధికారులు నిందితుడిని విచారిస్తున్నారు. అయితే, ఈ పేలుడుతో అతడికి సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. కేరళలోని కొచ్చిలో ఈ ఉదయం పేలుళ్లు జరగడం తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు.