వామ్మో.. ఆ దేశంలో ఏడు నెలల్లోనే 419 మందికి మరణశిక్షలు
ఇరాన్లో ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 419 మందికి మరణశిక్ష విధించినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. భారీ స్థాయిలో మరణ శిక్షలను అమలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఐరాస.. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు లోబడి విచారణ జరగలేదని తమకు తెలిసినట్లు పేర్కొంది.