BJP MLA : పోలీస్‌ను చెంపపై కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్!
విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారి చెంప చెళ్లుమనిపించారు పూణే బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కాంబ్లే. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు విమర్శలు గుప్పించారు. దీనిపై ఎమ్మెల్యే వివరణ ఇస్తూ.. తాను ఆ అధికారిని కొట్టలేదని.. కేవలం నెట్టేసినట్లు తెలిపారు.