Interim Budget: రైతులకు నిరాశ మిగిల్చిన మధ్యంతర బడ్జెట్!
మధ్యంతర బడ్జెట్లో పీఎం కిసాన్ నిధుల పెరుగుదల ఉంటుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది. ప్రపంచంలోనే అతిపెద్ద DBT పథకాలలో ఇది ఒకటి. 2019 మధ్యంతర బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించారు. పథకం కింద కేంద్రం 3నెలవారీ వాయిదాలలో ఏడాదికి రూ. 6వేల ప్రయోజనాన్ని ఇస్తుంది.