Sharad Pawar : పార్టీని స్థాపించిన వారి చేతిలో నుంచి లాగేసుకున్నారు.. ఇలాంటి అన్యాయం ఎప్పుడూ చూడలేదు!
ఎన్నికల సంఘం ఎన్సీపీని స్థాపించిన వారి చేతుల్లోంచి లాక్కొని ఇతరులు ఇచ్చింది. ఇలా ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదని శరద్ పవార్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మా ఎన్నికల గుర్తును తీసివేయడమే కాకుండా మా పార్టీని కూడా ఇతరులకు అప్పగించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.