Haryana:
హర్యానాలో పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీకి పునరజ్జీవం వస్తోంది అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇక్కడ వచ్చిన సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 45 శాతం, బీజేపీకి 38 శాతం, ఐఎన్ఎల్డీ-బీఎస్పీ కూటమి 5.2 శాతం, ఆప్ 1 శాతం, జేజేపీ ఒక్క శాతం కంటే తక్కువ, ఇతరులు 10 శాతం ఓట్లను పొందవచ్చని చెబుతున్నాయి. దీనికి తగ్గట్టుగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదవిని ఎవ్వరికి ఇవ్వాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా పార్టీ సీనియర్ నేతలు కుమారి సెల్జా, రణ్‌దీప్ సూర్జేవాలా పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా కూడా స్పందిచారు. కనీసం 55 స్థానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. రాష్ట్ర పార్టీ నేతలు కూడా ఇదే ఆశిస్తున్నారు. హర్యానాలో ప్రజలు బీజేపీ పాలనతో విసిగిపోయారని...అందుకే ఈసారి మార్పును కోరుకుంటున్నారని అంటున్నారు. దాంతో పాటూ ఇక్కడి కులసమీకరణాలు కూడా ఆ పార్టీని దెబ్బ తీసే అవకాశం ఉందని అంటున్నారు.
ఇదే హర్యానాలో పదేళ్ల క్రితం అంటే 2014లో చాలా మటుకు సర్వే సంస్థలు కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. కానీ అనూహ్యంగా బీజేపీ అధికారం చేపట్టింది. అప్పట్లో బీజేపీ గెలిచి అధికారం చేపట్టబోతోందని న్యూస్ 24-చాణక్య, ఏబీపీ న్యూస్-నీల్సన్ మాత్రమే అంచనా వేశాయి. టైమ్స్ నౌ ఇండియా, ఇండియా టీవీ-సీఓటర్ మాత్రం కాంగ్రెస్ గెలిచే సీట్లను కచ్చితంగా అంచనావేశాయి. 2019లో చూసుకుంటే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు బీజేపీ ఇదే హర్యానాలో 70 సీట్లకు పైగా గెలిచి అధికారం చేపడుతుందని అంచనా వేశాయి. కానీ అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఇండియాటుడే-మై యాక్సెస్ మాత్రం బీజేపీ 32-44 సీట్లు గెల్చుకుని అధికారం ముంగిట నిలిచిపోతుందని అంచనా వేసింది. అలాగే కాంగ్రెస్ 30-42 సీట్లు సాధిస్తుందని కూడా చెప్పింది.
Also Read: సామూహిక అత్యాచారం కాదు..సంజయ్ ఒక్కడే నిందితుడు, సీబీఐ ఛార్జ్‌షీట్