ఎన్నో ఏళ్లు కలలుగన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల కోసం ఎంతో పాటుబడ్డారు. పేదింటి కుటుంబాల్లో చిరునవ్వులు చూడాలనుకున్నారు. అదే తెగింపుతో సాధ్యంకాకపోయినా.. ఇచ్చిన మాట కోసం కేవలం రూ.1లక్షకే నానో కారును మార్కెట్ లోకి తీసుకొచ్చారు. కానీ ఒక రాంగ్ పబ్లిసిటీతో ఆ కారు నెగిటివ్ టాక్ ను అందుకుంది. రిలీజ్ అయిన మొదట్లో భారీ బుకింగ్స్ అందుకుంది. కానీ ఆ తర్వాత నెగిటివ్ టాక్ కి మొత్తం పడిపోయి ఫెయిల్యూర్ గా మారింది. మరి దీనిపై రతన్ టాటా ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎందుకు తక్కువ ధరకి తీసుకొచ్చారు
ఇండియాలో ఉన్న ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మినిమం నలుగురు లేదా ఐదుగురు వ్యక్తులు ఉంటారు. వారు ఎక్కడికి వెల్లాలన్నా బస్సు లేదా టూ వీలర్ ను ఎంచుకుంటారు. అయితే బస్సులో వెల్లాలంటే టికెట్ కోసం ఎక్కువ ఖర్చు అవుతుంది. దీంతో ఫ్యామిలీలో నలుగురున్నా, ఐదుగురున్నా వారి వద్ద ఉన్న టూ వీలర్ మీద అడ్జస్ట్ అయి వెళ్లిపోతారు. వాళ్ల ఆర్థిక పరిస్థితి బాగోకపోవడం కారణంగా టూ వీలర్ లోనే అందరూ జర్నీ చేస్తూ.. ఒకవైపు గవర్నమెంట్ రూల్స్ అతిక్రమిస్తున్నారు.
మరోవైపు వాళ్ల ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇది అసలైన ప్రోబ్లమ్. రతన్ టాటా సాల్వ్ చేయాలనుకున్న ప్రాబ్లమ్ ఇదే. అరవై నుంచి డబ్బైవేలు పెట్టి బైక్ కొని ఇబ్బందులు పడుతున్న పేద మధ్య తరగతి వాళ్లకి ఇంకొక ముప్పైవేలు పెడితే కంఫర్ట్ బుల్ గా ఒక కారులో వెళ్లొచ్చు అనే ఫీలింగ్ తీసుకురావాలనే ఇంటెన్సన్ తో రతన్ టాటా నానో కారును కేవలం ఒక లక్ష రూపాయలకు మాత్రమే అందిస్తామని మీడియా ముందు ప్రామిస్ చేశారు. అలానే తీసుకొచ్చారు.
మాట ఇచ్చాం.. కచ్చితంగా నానో తీసుకొద్దాం
పేద, మధ్య తరగతి కుటుంబాలు తమ బడ్జెట్ కి అనుగుణంగా అతి తక్కువ ధరలో కారును కొనుక్కునే వీలును కల్పిస్తూ నానో కారును కేవలం రూ.1 లక్షకే తీసుకొచ్చారు రతన్ టాటా. యంగ్ అండ్ టాలెంటెడ్ ఇంజినీర్స్ తో నానో కారును డిజైన్ చేయించారు. కానీ ఎంత ప్రయత్నించినా లక్షలో మాత్రం కారు తయారు చేయడం సాధ్య కాలేదు. కానీ జనాలకి ప్రామిస్ చేశారు కాబట్టి నానోలో ఉన్న బేస్ మోడల్ కి కేవలం రూ.1లక్ష ధర ఫిక్స్ చేశారు. దీని హై అండ్ మోడల్ లను మాత్రం అధిక ధరతో తీసుకొచ్చారు.
అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే.. రూ.1లక్ష బేస్ మోడల్ కి ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఏసీ కానీ, గ్లోబల్ ఎన్టీఈపీ సేఫ్టీ రేటింగ్ కానీ అస్సలు ఏమి ఉండవు. నిజానికి లక్ష రూపాయలకి నానోలో ఉన్న ఫీచర్లు చాలా ఎక్కువ. కానీ ఆ ఫీచర్లు మనల్ని యాక్సిడెంట్స్ నుంచి అయితే కచ్చితంగా కాపాడలేవు. అయితే సోషల్ మీడియాలో చాలా మంది నానో కారును.. త్రీవీలర్ ఆటోస్ తో మరికొంతమంది కాస్ట్ లీ కార్స్ తో కంపేర్ చేశారు. కానీ నానో కారుని కంపేర్ చేయాల్సింది వీటితో కాదు.. టూ వీలర్ మోటర్ సైకిల్ తో. రతన్ టాటా ఇంటిన్సెన్ కూడా అదే.
ఫెయిల్యూర్ కి కారణం ఏంటంటే- రతన్ టాటా
నానో కారు ఫెయిల్ కావడానికి కస్టమర్లలో ఉన్న రాంగ్ ఒపీనియన్ 40శాతం కారణం అయితే.. మరొక 60 శాతం టాటా కంపెనీ సేల్స్ టీం చేసిన రాంగ్ పబ్లిసిటీ. ఎందుకంటే మార్కెటింగ్ చేసే టైంలో వరల్డ్స్ మోస్ట్ అఫర్టబుల్ కారు అని మార్కెటింగ్ చేయాల్సిన నానోని.. వరల్డ్స్ చీపెస్ట్ కారు అని మార్కెటింగ్ చేశారు. నిజానికి చీప్ అనే పదం ఎక్క డ విన్నా ఆ వస్తువుకు విలువే ఉండదు. అలాంటిది ప్రపంచంలోనే చీపెస్ట్ కారు అని ఒక ట్యాగ్ లైన్.. ఎన్నో ఏళ్లుగా రతన్ టాటా కన్న కలని తుడిచిపెట్టేసింది.
నానో ఫెయిల్ కావడానికి మరొక రీజన్ ప్రైజింగ్
కారు కొనడానికి అసలు కారణం.. ఇది లక్ష రూపాయల్లో వస్తుందని చెప్పడం. చెప్పిన విధంగా ఈ కారు లక్షకి అందుబాటులోకి వచ్చినా.. ప్రాక్టికల్ గా ఆన్ రోడ్ బేస్ మోడల్ రూ.1.50 లక్షలు, హై అండ్ మోడల్ రూ.3లక్షల వరకు పెరిగిపోయేది. దీంతో నానోకి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. 2009లో నానో కారు లాంచ్ చేసినపుడు 30,000పైగా బుకింగ్స్ కాగా.. 2012కి 74,000పైగా బుకింగ్స్ తో దుమ్ము దులిపేసింది. అయితే ఆ తర్వాత జనాల్లో ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్ కారణంగా 2018 కల్లా ఇండియాలో తన ప్రొడక్షన్ ఆపేసే స్థాయికి పడిపోయింది.