Supreme Court:
వలస కార్మికులకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రేషన్ కార్డులను జారీ చేయడం లేదు. వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు కరోనా సమయంలో 2020లో సుమోటాగా విచారణ చేపట్టింది. దీని పలు సార్లు విచారణ చేసింది. ఈ క్రమంలో జాతీయ ఆహార భద్రత చట్టం కింద.. కోటాతో సంబంధం లేకుండా ఈ-శ్రమ్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న దాదాపు 8 కోట్ల వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలని 2021లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. అయితే ఈ ఆదేశాలను ఇప్పటి వరకు కొన్ని రాష్ఠ్రాలు మాత్రమే పాటించాయి. మిగతా రాష్‌ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వలస కార్మికులు రేషన్ కార్డులను ఇవ్వలేదు. దీని మీద న్యాయస్థనం ఇప్పటికే పలుసార్లు చెప్పింది. ఈసరి మరోసారి ఈ విషయం మీద విచారణ చేసిన సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో అంత ఉదాసీనంగా ఉడడనికి ఏముంది...ఎందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేడం లేదంటూ వ్యాఖ్యానించింది. ఈ అంశంలో ఎలాంటి ఉదాసీనతకు చోటు లేదని స్పష్టం చేసింది. ఇక తమకు ఓపిక నశించిందని..అందుకే మా ఉత్తర్వులను పాటించేందుకు మీకు చివరి అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. లేదంటే మీ కార్యదర్శులు కోర్టుకు రావాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. ఈ వ్యవహారంపై నవంబరు 19లోగా కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.