మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు

సంచలనం సృష్టించిన ట్రైనీ డాక్టర్ రేప్‌ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది.అతని మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.

author-image
By Manogna alamuru
New Update
principal

EX Principal Sandeep Ghosh:

స్వతహాగా డాక్టర్, ఒక పెద్ద కాలేజ్‌ కు ప్రిన్సిపల్...అయిఆ ఏ మాత్రం జాలి, దయ లేకుండా ప్రవర్తించారు సందీప్ ఘోష్. తన కాలేజ్‌లో ఒక ట్రైనీ ఆక్టర్ హత్యాచారానికి గురైతే..నిందితుడిని పట్టించాల్సింది పోయి..సాక్ష్యాలను మట్టుబెట్టేందుకు చేశారు. అంతేకాదు కాలేజ్ నిర్వహణలో కూడా ఎన్నో అవకతవక పనులు చేశారు. ట్రైనీ డాక్టర్ రేప్, హత్య కేసులో సందీప్ పాత్ర కూడా ఉందనే అనుమానం ఉంది. కాలేజ్‌కు సంబంధించిన ఏవో విషయాలు ఆమెకు తెలుసని...అందుకే ఆమెను రేప్ చేయించి చంపించేశారనే వాదనలు కూడా ఉన్నాయి. వీటన్నింటికీ కారణం మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అనే అంటున్నారు. ఇప్పటికే సీబీఐ ఇతనిని అరెస్ట్ చేసి..పలు కేసులు నమోదు చేసింది. ఇప్పుడు తాజాగా సందీప్ మెడికల్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ ప్రకటించింది. డబ్ల్యూబీఎంసీ నిర్వహిస్తోన్న రిజిస్టర్డ్‌ మెడికల్ ప్రాక్టీషనర్స్ జాబితా నుంచి ఘోష్‌ పేరును తొలగించిందని సంబంధిత అధికారి మీడియాకు తెలిపారు.

సందీప్ ఘోష్ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) బెంగాల్ విభాగం రీసెంట్‌గా డబ్ల్యూబీఎంసీని కోరింది. దాంతో పాటూ సెప్టెంబర్ ఏడున మెడికల్ కౌన్సిల్ ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే దీనికి సందీప్ ఏమీ సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు అతని సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది డబ్ల్యూబీఎంసీ.

Also Read: Movies: జానీ మాస్టర్ ఇష్యూపై స్పందించిన మంచు మనోజ్

Advertisment
తాజా కథనాలు