Waynad bjp Candidate:
వయనాడ్లో ప్రియాంకగాంధీకి బీజేపీ నుంచి పోటీ ఎవరో తేలిపోయింది. ఇక్కడ కాగ్రెస్ గట్టి పోటీ ఇచ్చేందుకు సమ వుజ్జీలనే దింపాలనే ఆలోచనతో ఈ స్థానానికి నవ్య హరిదాస్‌నును రంగంలోకి దించింది. నవ్య హరిదాస్.. బీజేపీలో చాలా కాలం నుంచి క్రియాశీలకంగా ఉన్నారు. ఈమె హెచ్‌ఎస్‌బీసీ ఐటీ డిపార్ట్‌మెంట్‌లో ఇంజనీర్‌గా పని చేశారు. కానీ ప్రజా సేవ చేయాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీ పార్టీలో చేరారు. కోజికోడ్ కార్పొరేషన్‌లో వరుసగా రెండో సారి బీజేపీ కౌన్సిలర్‌గా ఉన్నారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు. కార్పొరేషన్‌లో బిజెపి పార్లమెంటరీ పార్టీ నాయకురాలుగా ఉన్నారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోజికోడ్ సౌత్ నియోజకవర్గం నుంచి నవ్య ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పుడు ఒక కౌన్సిలర్‌ను ప్రియాంకపై బీజేపీ పోటీకి దింపింది.
వయనాడ్‌లో నవంబర్ 13న లోక్ సభ ఉప ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ అభ్యర్ధి ప్రియాంక గాంధీ అక్టోబర్ 23న నామినేషన దాఖలు చేయనున్నారు. దీనికి రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రా కూడా హాజరుకానున్నారు. పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా వెళ్లి ప్రియాంక నామినేషన్ దాఖలు చేయనున్నారు. వాయనాడ్ కలెక్టరేట్‌కు రోడ్‌షో ద్వారా వెళ్లి ప్రియాంక నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఇక వయనాడ్ ఎన్నికల ఫలితం నవంబర్ 23న విడుదల అవనున్నాయి.
Also Read: జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు..వాటర్ బాటిళ్ళు, సైకిళ్ళపై తగ్గింపు