ప్రముఖ విద్యావేత్త వాసిరెడ్డి అమర్ నాథ్ HMPV వైరస్ కు సంబంధించి తన ఫేస్ బుక్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఎనిమిది నెలల పాపకు ఈ వైరస్ ఎలా సోకింది? అని ప్రశ్నించారు. చైనా నుంచి నేరుగా ఫ్లైట్ వేసుకొని బెంగళూరు వచ్చి బేబీ కి సోకిందా? అని తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఆ వైరస్ ఎన్నో ఏళ్ళ నుంచి ఇండియాలో ఉందన్నారు. కొత్తగా వచ్చింది లేదని వివరించారు. ఇక ఆపండి మీ డ్రామాలు.. అంటూ ఆయన చేసిన పోస్టు ఇప్పుడు చర్చనీయాంశమైంది.ఇది కూడా చదవండి: వైరస్ తో జాగ్రత్త.. ఇంటింటా దగ్గు, జలుబు, జ్వరాలు! కరోనా సమయంలోనూ వాసిరెడ్డి అమర్ నాథ్ ఎప్పటికప్పుడూ ప్రజలకు అవగాహన కల్పించారు. భయపడాల్సిన అవసరం లేదని సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించారు. అసలు వ్యాక్సినే అవసరం లేదంటూ ఆయన చేసిన ప్రచారం ఆ సమయంలో సంచలనంగా మారింది. కరోనా సమయంలో సోషల్ మీడియాలో ఆయన విస్తృతంగా పాపులర్ అయ్యారు. అప్పటి నుంచి వేలాది మందిని ఆయనను ఫాలో అవుతున్నారు.ఇది కూడా చదవండి: Lockdown : భారత్‌లో చైనా కొత్త వైరస్ టెన్షన్ .. లాక్ డౌన్ పక్కానా? నెటిజెన్ల మద్దతు.. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన పోస్ట్ పై నెటిజెన్లు స్పందిస్తున్నారు. 'మీరిచ్చే సందేశమే మాకు ధైర్యాన్ని ఇస్తుంది సార్' అంటూ.. కొందరు కామెంట్లు పెడుతున్నారు. ''ఈ లక్షణాలతో గత మూడు నెలల నుండి నా దగ్గరకి రోజు కి కనీసం 10 మంది వస్తున్నారు. నాది మెడికల్ షాపు'' అంటూ మరో నెటిజెన్ కామెంట్ చేశారు. ''వచ్చేది ఎండాకాలం. ఎండ కి రోగ నిరోధక శక్తి ఎక్కువ. జ్వరం. జలుబు ఎఫెక్ట్ తక్కువ. హాస్పిటల్ లకి వెళ్లే వాళ్ళ సంఖ్య తక్కువ. ఇదొక మెడికల్ మాఫియా. వ్యాపారం అంతే..'' అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.