Prayagraj Flood: పీకల్లోతు వరద నీటిలో ‘బాహుబలి’ సీన్ రిపీట్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ నగరంలో వరదల కారణంగా ఒక జంట తమ చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి పీకల్లోతు వరదనీటిలో నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
uttar pradesh

uttar pradesh

గత రెండు మూడు వారాలుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు, భారీ వర్షాల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లలో వరదల పరిస్థితి తీవ్రంగా ఉంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, గంగా, యమునా నదుల నీటిమట్టాలు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుండడంతో అనేక లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. 

Prayagraj Flood

ఈ వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారణాసిలో గంగానది ప్రమాద స్థాయిని దాటడంతో దాదాపు 80 ఘాట్లు నీటమునిగాయి. అదే క్రమంలో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక ప్రయాగ్‌రాజ్‌లోనూ గంగా, యమునా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నగరంలోని అనేక కాలనీల్లోకి వరద నీరు చేరి ఇళ్లు మునిగిపోయాయి. 

వరద నీరు రోడ్లను ముంచెత్తడంతో ప్రజలు రాకపోకల కోసం పడవలను ఉపయోగిస్తున్నారు. విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. తాగునీరు కలుషితం అయిపోయింది. తినడానికి తిండి, తాగడానికి నీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు. 

తాజాగా ఈ వరద ప్రభావం వల్ల ఒక దంపతులు ఎదుర్కొన్న ఇబ్బందులు అందరినీ కంటనీరు తెప్పిస్తు్ంది. చోటా బఘాడా ప్రాంతానికి చెందిన భార్య భర్త పీకల్లోతు వరద నీటిలో తమ బిడ్డను పైకి ఎత్తుకుని మోసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆ దంపతులు అనారోగ్యంతో ఉన్న తమ నవజాత శిశువును హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి ఎలాంటి సౌకర్యం లేకపోవడంతో నీటిలోనుంచే నడుచుకుంటూ వెళ్లారు. ఈ దృశ్యం ప్రజలను కన్నీరు పెట్టిస్తోంది. 

బాహుబలి సీన్ రిపీట్

మరికొందరు ఈ దృశ్యం చూసి ‘బాహుబలి’ సినిమాలో శివగామి తమ బిడ్డను కాపాడే సన్నివేశాన్ని పోలి ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో పలువురు ప్రతిపక్ష నేతలు అధికార ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను సేఫ్‌గా రక్షించడంలో యోగి ప్రభుత్వం విఫలం అయిందని.. ఆడంబరాల కోసం ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేసే ఈ ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకోవడం లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

Advertisment
తాజా కథనాలు