ఉత్తరప్రదేశ్, లక్నోలో.. దారుణ ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఐఫోన్ డెలివరీ చేసేందుకు వెళ్లిన డెలివరీ ఏజెంట్‌ను అత్యంత ఘోరంగా హత్య చేసి చంపారు. అయితే రెండు రోజులైనా సాహు ఇంటికి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులను సంప్రదించారు. సాహు కాల్ డేటా, ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేయగా.. అసలు విషయం బయటపడింది.
డబ్బులు ఎగ్గొట్టడం కోసం..
చిన్‌హాట్ ప్రాంతానికి చెందిన గజానన్ అనే వ్యక్తి.. ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ.1.5 లక్షల విలువైన ఐఫోన్‌ను ఆర్డర్ పెట్టాడు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో 30 ఏళ్ల భరత్ సాహు అనే డెలివరీ ఏజెంట్ ఫోన్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లాడు. అక్కడ గజానన్.. సాహుని గొంతు నులిమి చంపేశాడు. అనంతరం సాహు డెడ్ బాడీని గోనె సంచిలో కుక్కి సమీపంలోని ఇందిరా కెనాల్‌లో పడేశారు. ఇదంతా ఫోన్ డబ్బులు ఎగ్గొట్టడానికి చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.