ప్రపంచ AI హబ్‌గా భారత్.. ఢిల్లీ డిక్లరేషన్‌కు 80 దేశాల మద్దతు

ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ద్వారా ఇండియన్ AI రంగానికి భారీ ఎత్తున పెట్టుబడులు వెల్లువెత్తాయి. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ సదస్సు సాధించిన విజయాలను వెల్లడిస్తూ, భారత్ ప్రపంచ ఏఐ హబ్‌గా ఎదుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

New Update
Delhi Declaration

ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ దేశ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ సదస్సు ద్వారా ఇండియన్ ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ రంగానికి భారీ ఎత్తున పెట్టుబడులు వెల్లువెత్తాయి. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ సదస్సు సాధించిన విజయాలను వెల్లడిస్తూ, భారత్ ప్రపంచ ఏఐ హబ్‌గా ఎదుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారీ పెట్టుబడులు: మౌలిక సదుపాయాల కల్పన కోసం వివిధ దేశాల నుండి 250 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. దీనికి అదనంగా, డీప్ టెక్ రంగంలో మరో 20 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్లకు కంపెనీలు మొగ్గు చూపాయి.

ఢిల్లీ డిక్లరేషన్: ఏఐ వినియోగంపై రూపొందించిన 'ఢిల్లీ డిక్లరేషన్'కు ఇప్పటికే 70 దేశాలు మద్దతు తెలిపాయి. శనివారం నాటికి ఈ సంఖ్య 80కి చేరుతుందని అంచనా.

ప్రజల స్పందన: ఐదు రోజుల పాటు జరిగిన ఈ సదస్సును సుమారు 5 లక్షల మందికి పైగా సందర్శించారు. ఏఐ రంగంలో భారత్ ప్రతిభను ప్రపంచం గుర్తించిందని మంత్రి పేర్కొన్నారు.

ఏఐ మిషన్ 2.0: లక్ష్యాలు

ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న ఇండియా ఏఐ మిషన్ 2.0 ద్వారా యువతకు అద్భుతమైన అవకాశాలు లభించనున్నాయి. సుమారు 20 లక్షల మందికి ఏఐ టెక్నాలజీలో స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఉన్న 38,000 జీపీయూ (GPUs)లకు అదనంగా మరో 20,000 జీపీయూలను అందుబాటులోకి తెచ్చి కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచనున్నారు.

Advertisment
తాజా కథనాలు