BIG Breaking : లోయలో పడిన ఆర్మీ ట్రక్.. ముగ్గురు జవాన్లు స్పాట్

జమ్మూ కశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో ఆర్మీ ట్రక్ ప్రమాదానికి గురైంది.  ట్రక్ అదుపు తప్పి లోయలో పడింది. దీంతో  స్పాట్ లోనే ముగ్గురు జవాన్లు మరణించగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

New Update
Army vehicle

Army vehicle Photograph: (Army vehicle)

జమ్మూ కశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో ఆర్మీ ట్రక్ ప్రమాదానికి గురైంది.  ప్రమాదశాత్తు ట్రక్ అదుపు తప్పి లోయలో పడింది. దీంతో  స్పాట్ లోనే ముగ్గురు జవాన్లు మరణించగా మరో ఐదుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెస్క్యూ టీమ్‌లతో పాటు స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన సైనికులలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది, అధునాతన వైద్య చికిత్స కోసం శ్రీనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు.

ఇద్దరు సైనికులు మృతి

ఉత్తర కశ్మీర్ జిల్లాలోని ఎస్‌కే పాయెన్ సమీపంలో ఆర్మీ వాహనం రోడ్డుపై నుంచి జారిపడి లోయలో పడిపోయిందని అధికారులు తెలిపారు. ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మస్రత్ ఇక్బాల్ మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు సైనికులు మృతి చెందారని చెప్పారు.  ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణ కొనసాగుతున్నందున మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  కాగా గతేడాది డిసెంబర్ 24వ తేదీన కూడా ఓ ఆర్మీ వెహికిల్ లోయలో పడటంతో ఐదుగురు జవాన్లు స్పాట్ లోనే చనిపోయారు.  

Also Read :  ఎంత మాటన్నావ్ బ్రో...  జాన్వీకపూర్‌ తో ఫీలింగ్స్ రావట్లేదట

Advertisment
తాజా కథనాలు