సీతారం ఏచూరికి అంతిమ విడ్కోలు.. భౌతికకాయం ఎయిమ్స్‌కు అప్పగింత !

సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి భౌతికకాయాన్ని ఎకేజీ భవన్‌ నుంచి ఎయిమ్స్‌కు తరలిస్తున్నారు. అక్కడికి చేరుకున్నాక ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌కు అప్పగించనున్నారు.

New Update
Sitaram Yechuri

కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి భౌతికకాయాన్ని శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం ఎకేజీ భవన్‌కు తరలించారు. దివంగత నేతకు నివాళులర్పించేందుకు సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు, పార్టీ శ్రేణులు, వివిధ రాజకీయ పార్టీ ప్రముఖులు తరలివచ్చారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, సీనియర్ నేత జైరాం రమేష్, ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ అలాగే ప్రముఖ చరిత్రకారిణి ప్రొఫెసర్ రొమిల్లా థాపర్ తదితరులు ఏచూరికి నివాళులర్పించారు. 

Also Read: వైద్యుల నిరసన శిబిరానికి వెళ్లిన సీఎం మమతా బెనర్జీ..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, అస్సాం, గుజరాత్, ఢిల్లీ, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన సీపీఐ(ఎం) నేతలు ఆయనకు నివాళులర్పించారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎకేజీ భవన్‌ నుంచి ఎయిమ్స్‌ వరకు అంతిమ యాత్ర మొదలైంది. అక్కడికి చేరుకున్నాక ఏచూరి భౌతిక కాయాన్ని ఎయిమ్స్‌కు కుటుంబ సభ్యులు అప్పగించనున్నారు.

శుక్రవారం సాయంత్రమే ఎయిమ్స్‌ నుంచి జేఎన్‌యూకి ఏచూరి భౌతిక కాయాన్ని విద్యార్థుల సందర్శనార్థం తీసుకొచ్చారు. సాయంత్రం 4 గంటల వరకు అక్కడ నివాళులర్పించే కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సందర్శనార్థం వసంత్‌ కుంజ్‌లోని నివసానికి తరలించారు. ఏచూరికి చైనా రాయబారి జు ఫీహాంగ్‌ సైతం నివాళులర్పించారు. ఇదిలాఉండగా ఏచూరి భౌతికకాయాన్ని పరిశోధన, బోధన కోసం ఎయిమ్స్‌కు అప్పగించడాన్ని దేశవ్యాప్తంగా నెటీజన్లు హర్షిస్తున్నారు. సోషల్‌ మీడియాలో లాల్‌ సలాం కామ్రేడ్ అంటూ పోస్టులు పెడుతున్నారు.

Also Read: హైదరాబాద్‌ లో కొత్త రైల్వే స్టేషన్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు