తిరుమల కల్తీ నెయ్యి వివాదం.. AR డెయిరీకి బిగ్‌ రిలీఫ్‌!

తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో AR డెయిరీకి  మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. అధికారులు జారీ చేసిన నోటీసులో అస్పష్టమైన ఆరోపణలు ఉన్నాయని న్యాయస్థానం తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆధారాలు లేవని, మళ్లీ కొత్తగా నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.

dferew5rewr
New Update

AR Dairy: తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో AR డెయిరీకి  మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. AR డెయిరీ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. AR డెయిరీకి మళ్లీ కొత్తగా నోటీసులు జారీ చేయాలని సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే షోకాజ్‌ నోటీసుపై స్పందించేందుకు AR డెయిరీకి తగిన సమయం ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు అధికారులు జారీ చేసిన నోటీసులో అస్పష్టమైన ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించినట్లు ఎక్కడా సరైన ఆధారాలు లేవని చెప్పింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను పునరుద్ఘాటిస్తూ రాజకీయాలకు దూరంగా ఉంచి విచారణ జరిపించాలని తెలిపింది. 
 

ఇక తమిళనాడు నుంచి టీటీడీకి ఏకైక నెయ్యి సరఫరాదారు తామేనని AR డెయిరీ తెలిపింది. ఒప్పందం ప్రకారం జూన్ 4, 6, 19, 27 నెయ్యిని పంపించామని,  టీటీడీ ప్రయోగశాలలో క్లియరెన్స్ వచ్చాకే సరఫరా చేశామని AR డెయిరీ చెప్పింది. మూడు ట్యాంకర్లకు టీటీడీ చెల్లింపులు కూడా చేసింది. మళ్లీ జులై 3, 4, 9 తేదీల్లో మరో నాలుగు ట్యాంకర్లను పంపించాం. కానీ ఎలాంటి కారణాలు చూపకుండా టీటీడీ వాటిని తిరస్కరించింది. తర్వాత వివరణ ఇవ్వాలని టీటీడీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఫుడ్‌ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్‌ యాక్ట్ - 2006 నిర్దేశించిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌ను కాదని.. గుజరాత్‌ లోని NDDB రిపోర్టులపై టీటీడీ ఆధారపడిందని AR డెయిరీ వివరణ ఇచ్చింది. 

#Tirupati Laddu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe