/rtv/media/media_files/2026/02/21/fotojet-31-2026-02-21-19-34-35.jpg)
The sensational The Kerala Story-2.
THE KERALA STORY 2 : ది కేరళ స్టోరీ..గతంలో ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకు ది కేరళ స్టోరీ - 2 పేరుతో సీక్వెల్ రాబోతుంది. ఐతే ఈ సినిమా ఇంకా థియేటర్లలోకి రాకముందే అగ్గిరాజేసింది. ఈ నెల 27న రిలీజ్‌కు సిద్ధమైన ఈ సినిమాను అడ్డుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అసలు ది కేరళ స్టోరీ - 2 సినిమాలో ఏముంది.
వివాదానికి కారణమైన ఆ ఒక్క సీన్ ఏంటి అనేది అందరూ చర్చిస్తున్న అంశం.కమాఖ్య నారాయణ్ సింగ్ డైరెక్షన్‌లో విపుల్ అమృత్ లాల్ షా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉల్కా గుప్త, అదితి భాటియా, ఐశ్వర్య ఓఝా కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు హిందూ యువతులు ప్రేమ పేరుతో మోసపోయి, ఇస్లాంలోకి మారిన తర్వాత వారు అనుభవించిన హింసను ఈ సినిమాలో చూపించామని మేకర్స్ చెబుతున్నారు.
బీఫ్ సీన్
ట్రైలర్‌లో ఒక హిందూ యువతిని బలవంతంగా బీఫ్ ( గోమాంసం) తినిపించే దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో నిప్పు రాజేసింది. కేరళ లాంటి రాష్ట్రాల ఆహారపు అలవాట్లపై ఇలాంటి చిత్రీకరణ సరికాదని విమర్శకులు ఫైర్ అవుతున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలో ఉన్న మత సామరస్యాన్ని దెబ్బతీయడానికే ఇలాంటి ఫాల్స్ ప్రాపగాండ (తప్పుడు ప్రచారం) చేస్తున్నారని ఆయన విమర్శించారు.శ్రీదేవ్ నంబూద్రి అనే వ్యక్తి కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. సినిమా పేరులో 'కేరళ' అని ఉంచి, రాష్ట్ర పరువు తీస్తున్నారని ఆయన వాదించారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. కేంద్ర సమాచార ప్రసార శాఖ, సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 24న దీనిపై తుది విచారణ జరగనుంది."
గతంలో వచ్చిన మొదటి భాగం 280 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి, నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. కానీ, అది కేవలం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తీసిన సినిమా అని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు పార్ట్ 2 కూడా అదే దారిలో వెళ్తోంది. సినిమా మేకర్స్ మాత్రం ఇది 'ట్రూ ఈవెంట్స్' ఆధారంగా తీశామని అంటున్నారు. కానీ విమర్శకులు మాత్రం దీనిని ప్రాపగాండ ( విద్వేషపూరిత ప్రచారం) అని పిలుస్తున్నారు. కళకు, రాజకీయాలకు మధ్య ఉన్న గీత చాలా సన్ననిది. ఒకవైపు భావ ప్రకటన స్వేచ్ఛ, మరోవైపు మత సామరస్యం.. ఈ రెండింటి మధ్య 'ది కేరళ స్టోరీ 2' ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
Follow Us