Punjab : ముగ్గురు దొంగలను సింగిల్‌ హ్యాండ్ తో ఆపిన సూపర్‌ ఉమెన్‌!

పంజాబ్‌ కు చెందిన మండూప్‌ కౌర్ అనే మహిళ ముగ్గురు దొంగలను ఒంటి చేత్తో ఆపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. ఆమెను రియల్‌ హీరో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

punjab
New Update

Robbery : మహిళలు నిత్యం ఇంట్లో ఒంటి చేత్తో ఎన్నో పనులు చేస్తుంటారు. ఎంతోమంది మహిళలు తమ కుటుంబం కోసం అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించడం గురించి మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం. తాజాగా పంజాబ్‌కు చెందిన ఒక మహిళ ఇంట్లో దొంగతనానికి వచ్చిన ముగ్గురు దుండగులను అడ్డుకుంది. ఆ మహిళ ధైర్యం, బలం ముందు ఆ దొంగలు తోకముడిచారు.  

వివరాల ప్రకారం… అమృత్‌సర్‌లోని వెర్కా ప్రాంతంలో జగ్జిత్ సింగ్‌ అనే నగల వ్యాపారి కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అతడికి భార్య మండూప్ కౌర్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జగ్జిత్ ప్రతిరోజు ఉదయాన్నే తన బంగారం షాపుకి వెళ్తాడు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మండూప్ తన పిల్లలతో కలిసి ఇంట్లో ఉంది. ఆయుధాలతో ముగ్గురు దొంగలు గోడ దూకి రావడాన్ని మండూప్‌ చూసింది.

 వెంటనే అప్రమత్తమైన మండూప్.. అన్ని గదులకు తాళం వేసింది. పిల్లలను మరో గదిలో ఉంచింది. ముగ్గురు దుండగులు ఇంటి ప్రధాన ద్వారం తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. ఆమె లోపల నుంచి తలుపు మూయడానికి తీవ్రంగా ప్రయత్నించింది. అవతలి నుంచి ముగ్గురు దొంగలు ఎంత ప్రయత్నం చేసినా.. ఆమె వెనకడుగు మాత్రం వేయలేదు. దాదాపు 10-15 నిమిషాల పాటు దొంగలను అడ్డుకుంది. చివరకు తలుపు మూసి.. పక్కనే ఉన్న సోఫాను తలుపునకు అడ్డుగా పెట్టింది.

దాంతో దొంగలు లోపలికి ప్రవేశించలేకపోయారు. మండూప్ గట్టిగా అరవడమే కాకుండా.. ఇరుగుపొరుగు వారికి కాల్ చేసింది. దాంతో దుండగులు అక్కడినుంచి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న జగ్జిత్ సింగ్‌ ఇంటికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను గుర్తించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

మండూప్ కౌర్ చేసిన ధైర్యసాహసాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించిన ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘సూపర్ ఉమెన్’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read :  కోలీవుడ్ డైరెక్టర్ పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. వైరల్ అవుతున్న వీడియో

#punjab #brave-women
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe