/rtv/media/media_files/2026/01/24/fotojet-10-2026-01-24-10-31-50.jpg)
Terror conspiracy foiled
Terror module: మరో రెండు రోజుల్లో రిపబ్లిక్ డే (Republic Day) ఉందనగా ఇంటెలిజెన్స్ అధికారులు ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. జనవరి 26న దేశంలో రిపబ్లిక్ డే ఉత్సవాలను నిర్వహించుకోవడానికి సిద్ధమవుతుండగా
ఉగ్ర దాడుల కుట్ర బయటపడింది. దేశంలో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందడంతో ఈ మేరకు గాలింపు చర్యలు చేపట్టిన ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీసులు ఖలిస్థానీ సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ముఠాను పంజాబ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు సభ్యులు గల ఈ ఉగ్రవాదులను అరెస్టు చేసి, వారి నుంచి 2.5 కిలోల ఆర్డీఎక్స్‌ను, భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నారు. విచారణలో వారు రిపబ్లిక్ డే వేడుకల్లో దాడులకు వారు కుట్ర పన్నినట్లు తెలిపారు.
అరెస్టు చేసిన నిందితులను శరణ్ ప్రీత్ సింగ్, దిల్జోత్ సింగ్ సైని, హర్మాన్, అజయ్, అర్ష్‌దీప్ సింగ్‌లుగా గుర్తించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఉగ్ర ముఠాను అమెరికాకు చెందిన బబ్బర్ ఖల్సా హ్యాండ్లర్లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వారి ఆదేశాల మేరకు నిందితులు పలు ప్రాంతాల్లో దాడులకు ప్రణాళికలు రచించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వివరించారు. ఉగ్రవాద ముఠాలు దేశంలోని పలు ప్రాంతాల్లో మరిన్ని దాడులకు ప్లాన్ చేస్తుండడంతో దేశ రాజధాని ఢిల్లీ సహా ముఖ్యనగరాల్లో భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. గతేడాది ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో గణతంత్ర దినోత్సవానికి భద్రతను కట్టుదిట్టం చేస్తున్నామన్నారు. దేశంలో మరిన్ని ఉగ్ర కుట్రలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు.
Follow Us