TATA Grp VS Pakistan:
భారత్‌లో టాటా గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 400 బిలియన్ డాలర్ల విలువ ఉంటుంది. దేశంలో అతి పెద్ద పారిశ్రామిక వ్యవస్థను టాటా గ్రూప్స్ కలిగి ఉంది. గుండు సూది నుంచి విమానం వరకు, ఉప్పు నుంచి ఆటోమోబైల్స్ వరకు టాటా వస్తువులు ఉంటాయి. అందుకే టాటా విలువ చాలా ఎక్కువ అని చెబుతున్నారు. ఇది ఎంత అంటే..పక్క దేశం పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ కంటే ఎక్కువ అని చెబుతున్నారు. 2024 చివరి నాటికి పాక్ ఆర్థిక వ్యవస్థ విలువ 347 బిలియన్ డాలర్లుగా ఉంది. దీనికన్నా టాటా క్యాపిటలైజేషనే ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో టాటా తన సంస్థని విస్తరించారు. 1868లో స్థాపించిన టాటా గ్రూప్ భారతదేశంలో పురాతన పారిశ్రామిక వ్యవస్థల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది ఈ గ్రూప్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక్క టీసీఎస్ సంస్థలోనే 6,15,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
దేశంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థగా పేరుగాంచిన టాటా గ్రూప్ వంశవృక్షం చాలా పెద్దదే. 1868లో ట్రేడింగ్ కంపెనీగా ప్రారంభమైన టాటా గ్రూప్ కు చెందిన 100 కంపెనీలుండగా 150 దేశాల్లో ఉత్పత్తులు విస్తరించాయి. అయితే ఇంతటి ప్రాముఖ్యత పొందిన టాటా గ్రూప్ వంశవృక్షానికి రతన్ దొరబ్ టాటా పునాది వేశారు. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ నుంచి వందల సంఖ్యలో వ్యాపారవేత్తలున్నారు. రతన్ టాటా తండ్రి పేరు నావెల్ టాటా. ఆయనను రతన్‌జీ టాటా దత్తత తీసుకున్నారు. టాటా గ్రూప్ సంస్థలు స్థాపించిన జెమ్‌షెడ్‌జీ టాటా కుమారుడే ఈ రతన్‌జీ టాటా. అయితే నసర్వాన్‌జీ టాటాను టాటా కుటుంబానికి మూలపురుషుడిగా చెబుతారు. టాటా వంశం ఆయన నుంచే మొదలవగా.. పార్సీ పూజారి అయిన నసర్వాన్‌జీ టాటా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన మొదటి వ్యక్తి.
Also Read: TATA : స్టాక్ మార్కెట్‌లో రతన్ టాటాకు గౌరవం..15% పెరిగిన టాటా షేర్లు