Breaking: బాణాసంచా గోదాంలో భారీ పేలుడు.. అక్కడికక్కడే ముగ్గురి మృతి!

తమిళనాడులోని తిరువూర్‌ జిల్లాలో బాణసంచా గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ పేలుడులో మంటల్లో చిక్కుకొని ముగ్గురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మరో నలుగురి వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

New Update
fire hazard

Tamil Nadu: తమిళనాడులోని తిరువూర్‌ జిల్లాలో దారుణ ఘటన సంభవించింది.  బాణసంచా గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం సంభవించిన భారీ పేలుడులో కనీసం మంటల్లో చిక్కుకొని ముగ్గురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మరో నలుగురి వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. బాణసంచా గోడౌన్ ఇళ్ల మధ్యలో ఉండటంతో భయంతో స్థానికులంతా ఒక్కసారిగా పరుగులు తీశారు.

పది ఇళ్లు ధ్వంసం:

ఈ పేలుడు ధాటికి 10 ఇళ్లు ధ్వంసం అయ్యాయి.  ప్రమాదంపై వెంటనే సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బందికి ఘటనా స్థలానికి చేరుకుని మంటలర్పే ప్రయత్నం చేశారు. ఈ దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదంలో విషయం తెలుసుకున్న పోలీసులు  సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి:మనం చూడలేనివి ఈ జంతువులు చూడగలవు

Advertisment
తాజా కథనాలు