Supreme Court:
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా టిటోరా గ్రామానికి చెందిన అతుల్‌కుమార్ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంక్ తెచ్చుకున్నాడు. అతనికి ఐఐటీ ధన్‌బాద్‌లో సీటు కూడా వచ్చింది. అయితే సీటు ఖరారు చేసేందుకు జూన్ 24 లోపు రూ.17,500 ఫీజు కట్టాల్సి ఉండగా పేదవాడు అవడంతో దానిని చెల్లించలేకపోయాడు దినసరి కూలీలైన అతడి తల్లిదండ్రులు గడువులోగా ఫీజు కట్టలేకపోయారు. దీంతో టిటోడా గ్రామస్థులు విరాళాలు వేసుకొని ఆ మొత్తం సమకూర్చారు. కానీ ఈలోగా ఫీజు గడువు ముంచుకువచ్చింది. అప్పుడు కూడా ఫీజు కట్టాలని ట్రై చేసిన అతుల్.. సాంకేతిక కారణాలతో ధన్‌బాద్ ఐఐటీ ఆన్‌లైన్ పోర్టల్ పనిచేయక ఆ మొత్తాన్ని సకాలంలో కట్టలేకపోయాడు. సీటు వచ్చిన కాలేజ్‌లో జాయిన్ అవ్వలేకపోయాడు.
దీంతో అతుల్ సాయం కోసం విద్యార్థి జాతీయ ఎస్సీ కమిషన్‌ను, ఝార్ఖండ్ లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయించాడు. ఝార్ఖండ్ లీగల్ సర్వీస్ అథారిటీ ఈ ఏడాది ఐఐటీ మద్రాస్ ఈ పరీక్ష నిర్వహించినందువల్ల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. అక్కడికి వెళితే.. మద్రాస్ హైకోర్టు దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో వారు సుప్రీంను ఆశ్రయించగా వాదనలు విన్న న్యాయస్థానం విద్యార్థికి అడ్మిషన్ కల్పించాలని ఐఐటీ ధన్‌బాద్‌ను ఆదేశించింది. ఇప్పుడు ఫీజు కట్టించుకుని వెంటనే కాలేజ్‌లో చేర్పించుకోవాలని చెప్పింది. అయితే మరోవైపు ఫీజు కట్టకుండా మూడు నెలలుగా ఏం చేస్తున్నారని అతుల్ న్యాయవాదులను కూడా చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. చివరికి న్యాయవాదులు చెప్పిన విరాలను విని...విద్యార్థికి న్యాయం చేకూర్చింది.