TN: హిందీని రుద్దకండి..మళ్ళీ రాజుకున్న వివాదం..మోదీకి స్టాలిన్ లేఖ

తమిళనాడులో మరోసారి హిందీ వివాదం రాజుకుంది. హిందీయేతర రాష్ట్రాల్‌లో హిందీ కార్యక్రమాలను నిర్వహించడంపై తమిళనాడు ముఏఖ్యమంత్రి స్టాలన్ అసహనం వ్యక్తం చేశారు. మామీద ఎందుకు హిందీని రుద్దుతున్నారంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. 

tn
New Update

CM Stalin Letter To PM MOdi: 

అక్టోబర్ 18, 2024న హిందీ మాస వేడుకల ముగింపు సందర్భంగా చెన్నై దూరదర్శన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుగుతున్నాయి. దీనిపై తమిళనాడు స్టాలిన్ మండిపడుతున్నారు. హిందీ ప్రాథమిక భాష కానీ రాష్ట్రంలో హిందీ భాషకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం ఏంటంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచన చేసే ముందు పునరాలోచించుకోవాలంటూ ప్రధాని మోదీకి స్టాలిన్ లేఖ రాశారు. భారత రాజ్యాంగం ఏ భాషకు జాతీయ హోదా ఇవ్వలేదని, హిందీ-ఇంగ్లీష్ కేవలం అధికారిక ప్రయోజనాల కోసమే మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. బహు భాషలతో నిండి ఉన్న భారతదేశంలో.. హిందీకి ప్రత్యేక హోదా ఇవ్వడం, హిందీ మాట్లాడని రాష్ట్రాలలో హిందీ మాసాన్ని జరపడం లాంటివి ఇతర భాషలను కించపరచడమే అవుతుందని అన్నారు.

Also Read: మీరెవర్ని చంపినా , ఎంతమందిని చంపినా తగ్గేదే లేదు..హమాస్ సంచలన ప్రకటన

Also Read: Byju's: కోట్ల నుంచి సున్నాకు..బైజూస్ పతనం

దయచేసి అన్ని భాషలనూ గౌరవించండి..

తమిళనాడు ఎప్పటినుంచో హిందీని స్వీకరించడం లేదని తెలిసి కూడా ఇక్కడ హిందీకి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడం ఆమోదయోగ్యం కాదని స్టాలిన్ లేఖలో రాశారు. అలా కాదని ఈ కార్యక్రమాలను కొనసాగించాలని ప్రభుత్వం పట్టుబడినట్లైతే, ఆయా రాష్ట్రాల్లోని స్థానిక భాషలకు కూడా అంతే ఘనంగా జరుపుకోవాలని ఆయన అన్నారు. దేశంలో గుర్తింపు పొందిన అన్నిభాషల గొప్పతనం తెలిసేలా ఉత్సవాలుగా జరపాలని...వాఇ కోసం కూడా కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్రాన్ని కోరారు. ఇలాంటి కార్యక్రమాలు వివిధ భాషా వర్గాల మధ్య సత్సంబంధాలను పెంచుతాయని, భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించగలవని ఆయన లేఖలో రాశారు. 

Also Read: Stock Market:ఎట్టకేలకు లాభాల్లో సూచీలు..కాస్త మెరుగ్గా మార్కెట్

Also Read: ఫుట్‌పాత్‌ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే!

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe