పని ఒత్తిడి వల్ల యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్న 26 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ప్రస్తుతం ఉద్యోగులు పని గంటలపై చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ఈ ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించారు. పని ప్రదేశాల్లో ఫిక్స్‌డ్ క్యాలెండర్ ఉండాలని.. వారానికి 5 రోజులే పని ఉండాలనే అంశాన్ని లేవనెత్తారు. ఇందుకోసం పార్లమెంట్‌లో చట్టం తెచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు.
Also Read: తిరుపతి లడ్డూ కల్తీ చేయడం పాపం.. మాజీ రాష్ట్రపతి కోవింద్ ఆందోళన!
'' యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా కంపెనీలో 4 నెలల పాటు రోజూ 14 గంటల పాటు తీవ్రమైన ఒత్తిడిలో పనిచేసిన అన్నా సెబాస్టియన్ గండెపోటు ప్రాణాలు కోల్పోయింది. ఆమె తండ్రితో మాట్లాడక భావోద్వేగానికి గురయ్యాను. ఆయన చేసిన సూచనకు నేను అంగీకరించాను. ప్రభత్వ సంస్థల్లోనైనా, ప్రైవేటు సంస్థల్లోనైనా పని ప్రదేశాల్లో ఫిక్స్‌డ్ క్యాలెండర్ ఉండాలి. 8 గంటలకు మించి పని ఉండకూడదు. వారానికి 5 రోజులు మాత్రమే పని ఉండాలి. ఈ విషయాన్ని నేను పార్లమెంటులో లేవనెత్తుతాను. పని ప్రదేశాల్లో అమానవీయ చర్యలకు పాల్పడ్డవారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. జరిమానాలు విధించాలి. పని చేసే చోట మానవ హక్కులను అడ్డుకోకూడదు. వచ్చే పార్లమెంట్ సమావేశల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతాం'' అని శశి థరూర్ రాసుకొచ్చారు.
ఇదిలాఉండగా పూణెలోని యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్‌లో పనిచేస్తున్న కొచ్చికి చెందిన అన్నా సెబాస్టియన్ ఈ ఏడాది జులై 20న మరణించారు. కంపెనీలో విధుల్లో ఉండగా ఆమె ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యారు. దీంతో తోటి ఉద్యోగులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినప్పటికీ అన్నా సెబాస్టయన్ చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే పని ఒత్తిడే ఆమె మరణానికి కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే అన్నా సెబాస్టియన్ తల్లి అనితా.. ఇటీవల ఈవై ఇండియా హెడ్‌కు రాసిన లేఖతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన కేంద్రం విచారణ జరుపుతామని హామీ ఇచ్చింది.
Also Read: జార్ఖండ్‌లో రెండు రోజులు ఇంటర్నెట్ బంద్