Dana Cyclone: తుపాన్‌ ఎఫెక్ట్‌..నాలుగు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి.. అల్పపీడనంగా మారి క్రమక్రమంగా వాయుగుండంగా మారింది.ఈ క్రమంలో 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 4 రోజుల పాటు బెంగాల్‌ తో పాటు, ఒడిశా రాష్ట్రాల్లో స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు.

New Update
Telangana : బంగాళాఖాతంలో వాయుగుండం...తెలంగాణ పై ఎంత ప్రభావం అంటే!

School Holidays: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి.. అల్పపీడనంగా మారి క్రమక్రమంగా వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం అతి తీవ్ర తుఫానుగా మారనుంది. దీనికి దానా తుపాను అని భారత వాతావరణ శాఖ పేరు పెట్టడం జరిగింది. ఇక ఈ దానా తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ఉండనుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.

4 రోజుల పాటు... 

ఈ క్రమంలోనే ఈనెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 4 రోజుల పాటు పశ్చిమ బెంగాల్‌లో.. ఈనెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఒడిశాలోని స్కూళ్లకు సెలవులను అధికారులు ప్రకటించారు. ఈ దానా తుపాన్ ఈనెల 24వ తేదీన ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ దానా తుపాన్ ప్రభావంతో ఇప్పటికే ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఏపీ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

Also Read: హ్యాపీ బర్త్‌డే డార్లింగ్.. నెట్టింట దుమ్ము లేపుతున్న ప్రభాస్ ఫ్యాన్స్

తీరం దాటే సమయంలో మరింత భీకరమైన గాలులు, వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తుపాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి తీర ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక ఈ దానా తుపాన్‌ను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు సిద్ధం అయ్యాయి.

Also Read:  నేడు ఏపీ కేబినెట్ భేటీ.. సంచలన ప్రకటన చేసే ఛాన్స్!

కాగా దానా తుపాన్‌ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు బెంగాల్‌లోని పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. బంకూర, హుగ్లీ, హౌరా, కోల్‌కతా, దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, పర్బా మందిర్‌, మేదినీపూర్‌, పశ్చిమ మిడ్నాపూర్‌, ఝాగ్రామ్‌ జిల్లాల్లోని స్కూళ్లకు బెంగాల్ ప్రభుత్వం 4 రోజుల పాటు సెలవులు ప్రకటించింది.

Also Read:  ఐదేళ్లుగా నకిలీ కోర్టు.. గుట్టు రట్టు చేసిన పోలీసులు.. ఎక్కడంటే?

అదే సమయంలో ఒడిశాలోని స్కూళ్లకు అక్కడి ప్రభుత్వం ఈనెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 3 రోజుల పాటు సెలవులు ఇచ్చింది. కేంద్రపారా, భద్రక్, బాలాసోర్, మయూర్‌భంజ్, కియోంజ్‌హార్, ధెంకెనాల్, గంజాం, పూరీ, జగత్‌సింగ్‌పూర్, , జాజ్‌పూర్, అంగుల్, ఖుద్రా, నాయాగార్గ్, కటక్ జిల్లాల్లో దానా తుపాను కారణంగా సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆ రాష్ట్ర అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 

Also Read:  80 విమానాలకు బాంబు బెదిరింపులు

Advertisment
Advertisment
తాజా కథనాలు