BIG BREAKING: దేశంలో ఇక క్రాకర్స్ బంద్.. సుప్రీంకోర్టు సంచలనం!

టపాసులపై సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్ చేసింది. కేవలం ఒక్క ఢిల్లీలోనే కాకుండా దేశమంతటా బ్యాన్ చేయాలని సూచించింది. కాలుష్యం ఒక్క ఢిల్లీ ప్రజలకే కాదు.. దేశంలో అనేక చోట్ల వాయు కాలుష్యం విపరీతంగా ఉందని  అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

New Update
india

టపాసులపై సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్ చేసింది. కేవలం ఒక్క ఢిల్లీలోనే కాకుండా దేశమంతటా బ్యాన్ చేయాలని సూచించింది. కాలుష్యం ఒక్క ఢిల్లీ ప్రజలకే కాదు.. దేశంలో అనేక చోట్ల వాయు కాలుష్యం విపరీతంగా ఉందని  అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా బాణసంచా కాల్చడం నిషేధించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రం,  రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని ఆదేశించింది.  ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో బాణసంచా అమ్మకం, నిల్వ, రవాణా, తయారీని నిషేధిస్తూ  ఏప్రిల్ 3వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 

సుప్రీంకోర్టు నోటీసు జారీ

ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో బాణసంచాపై పూర్తి నిషేధానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సిఎక్యూఎంకు కూడా సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ సందర్భంగా, ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ మాట్లాడుతూ ఏ విధానం ఉన్నా అది పాన్-ఇండియా స్థాయిలో ఉండాలి. దేశంలోని ఢిల్లీ కోసం మాత్రమే విధానాన్ని రూపొందించలేం అని జస్టిస్ గవాయ్ అన్నారు. గత శీతాకాలంలో తాను అమృత్‌సర్‌కు వెళ్లానని, అక్కడి కాలుష్యం ఢిల్లీ కంటే దారుణంగా ఉందని ఆయన అన్నారు. పటాకులను నిషేధించాలంటే, అది దేశవ్యాప్తంగా ఉండాలని అన్నారు.

ఢిల్లీలోని ఉన్నత వర్గాల ప్రజలు టపాసుల వల్ల వచ్చే కాలుష్యాన్ని మాత్రమే పట్టించుకుంటున్నారని, దేశంలోని మిగతా ప్రాంతాల ప్రజల గురించి ఎవరూ ఆలోచించడం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టపాసుల తయారీలో నిమగ్నమైన కార్పొరేట్ సంస్థలను కోర్టు విమర్శించింది. ప్రజల ఆరోగ్యం కంటే లాభాలే ముఖ్యమని ఈ సంస్థలు భావిస్తున్నాయని పేర్కొంది. ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రాధాన్యత ఇవ్వాలని, టపాసుల వల్ల కలిగే దుష్పరిణామాలను తీవ్రంగా పరిగణించాలని కోరింది.  కాగా గత కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీలో దీపావళి సమయంలో టపాసుల వల్ల గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోతోంది. దీనిపై పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (PIL) దాఖలయ్యాయి. గతంలో సుప్రీంకోర్టు ఢిల్లీలో టపాసులపై పాక్షిక నిషేధం విధించింది. 

Advertisment
తాజా కథనాలు