Sadhguru: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్జీ వాసుదేవ్‌కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. అమ్మాయిలను సన్యాస జీవితం గడిపేలా ఎందుకు ప్రేరేపిస్తున్నారంటూ ప్రశ్నించింది. తన కూతుళ్లు ఇద్దరికీ పెళ్లి చేసి ఇతర యువతులను సన్యాస మార్గంలో నడుచుకోవాలంటూ ఎంకరేజ్ చేయడంలో ఉద్దేశమేమిటో స్పష్టతనివ్వాలంటూ ఆదేశించింది. ఈ మేరకు తమ ఇద్దరు కుతుళ్లకు బ్రెయిన్ వాష్ చేసి.. ఈషా యోగా సెంటర్లో పర్మనెంట్‌గా ఉండేలా చేశారంటూ రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజు వేసిన HCP పిటిషన్‌ను జస్టిస్ ఎస్ఎం సుబ్రమణ్యం, వీ శివజ్ఞానంతో కూడిన ధర్మాసనం విచారించింది.
అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తున్నారంటూ..
ఈ మేరకు కోయంబత్తూరులోని తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ జగ్గీపై కేసు పెట్టారు. తన 42, 39 ఏళ్లున్న ఇద్దరు కూతుళ్లను జగ్గీ మాయమాటలతో పెళ్లి చేసుకోకుండా చేశారంటూ కోర్టును ఆశ్రయించారు. కూతుళ్లు వదిలి వెళ్లడం వల్ల తమ జీవితం దుర్భరమైనట్లు ఆ పేరెంట్స్ కోర్టు ముందు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కామరాజు కూతుళ్లను కోర్టు ప్రశ్నించగా.. తమ ఇష్ట ప్రకారమే ఈషా ఫౌండేషన్‌లో ఉంటున్నట్లు తెలిపారు. ఎవరూ తమను బంధించలేదని చెప్పారు. దీంతో ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టాలని జడ్డీ పేర్కొన్నారు. అలాగే ఈషా ఫౌండేషన్‌తో లింకున్న అన్ని కేసులను లిస్టు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.