రతన్ టాటా..! కష్టంతోపాటు సరికొత్త ఆలోచనలు ఉంటే అత్యున్నత శిఖరానిలకు చేరుతారని నిరూపించారు. రతన్ టాటా ప్రస్థానం ముందుగా సాధారణ వ్యక్తి జీవితం లాగే ప్రారంభమైంది. పై చదువులకోసం అమెరికా వెళ్లిన తర్వాతే.. జీవితం అంటే ఇదే అని అర్థమైందట. ఎలాగైనా డబ్బులను కొంతైనా ఇంటికి పంపాలని.. చదువుతో పాటు, చిన్న చితక పనులు చేస్తూ.. అమెరికా నుంచి ఇంటికి ఒక డాలర్ నుంచి అర డాలర్ పంపేవారట. ఈ క్రమంలో అమెరికాలోని ఓ హోటల్ లో అంట్లు కూడా తోమరట.
కొంత కాలానికి ఉద్యోగం..
కొంత కాలానికి ఒక అద్భుతమైన కంప్యూటర్ సంస్థలో జాబ్ ఆఫర్ లభించింది. కానీ, ఆయన దానిని వదిలిపెట్టుకొని ఇండియాకి వచ్చారు. రతన్ టాటా మొదటగా జంషెడ్పూర్ లోని స్టీల్ ఉత్పత్తి విభాగంలో సాధారణ ఉద్యోగిగా అడుగుపెట్టారు. అక్కడ కొన్ని వేలమంది కార్మికులతో కలిసి నిప్పుల కొలిమి దగ్గర కూడా 9 గంటల పాటు పనిచేసేవారట. ఇలా అయన జీవితం, అడుగడుగునా ఆదర్శప్రాయమే..