/rtv/media/media_files/cF7TlqNcU3oj9aOBrrpH.jpg)
రతన్ టాటా ఇక లేరు. ఆయన 86 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ముంబై వర్లీలోని అగ్నిదాహ్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులే కాకుండా అన్ని రంగాల ప్రజలు రతన్ టాటాని చివరి చూపు చూసేందుకు వచ్చారు.
రతన్ టాటా సవతి తల్లి సిమోన్ డునోయర్
అదే సమయంలో ఆయన కుటుంబ సభ్యులు సైతం వచ్చారు. అందులో రతన్ టాటా సవతి తల్లి సిమోన్ డునోయర్ కూడా అతనిని చూడటానికి వచ్చారు. అదేంటి రతన్ టాటా మథర్ ఇంకా బ్రతికే ఉన్నారా? అని ఆశ్చర్యపోతున్నారా.. అవును ఆమె బ్రతికే ఉన్నారు. కొడుకు చివరి చూపు కోసం ఆమె వచ్చారు. ప్రస్తుతం సిమోన్ డునోయర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
VIDEO | Simone Tata, stepmother of Ratan Tata, leaves after paying last respects to the industrialist at Worli Crematorium in Mumbai.
— Press Trust of India (@PTI_News) October 10, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/SFES4c6gBv
ఇది కూడా చదవండి: రతన్ టాటా వారసుడు ఎవరు?.. రేసులో నలుగురు !
రతన్ టాటా తల్లిదండ్రులు నావల్ టాటా, సూనీ. రతన్ టాటాకి 10 ఏళ్లు ఉన్నప్పుడు వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత నావల్ టాటా స్విస్ మహిళ సిమోన్‌ను వివాహం చేసుకున్నారు. వారికి నోయెల్ టాటా అనే కుమారుడు ఉన్నాడు. అయితే ఇదంతా ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఎందుకంటే రతన్ టాటా పెద్దగా లైమ్ లైట్‌కు దూరంగా ఉంటారు. ఆయన ఒక వ్యాపార వేత్త మాత్రమే కాకుండా సామాజిక కార్యకర్త కూడా. అందుకే ఆయన గురించి ఎవరికీ తెలియదు.
Ratan Tata’s love for dogs was legendary. His pet (Goa) meeting him for the last time 💔 #Ratan #RatanTata pic.twitter.com/paX54zihwu
— Prashant Nair (@_prashantnair) October 10, 2024
రతన్ టాటా సవతి తల్లి ఆస్తులు
కొన్ని నివేదికల ప్రకారం.. రతన్ టాటా సవతి తల్లి సిమోన్ డునోయర్‌కు వేల కోట్లు ఆస్తులున్నాయని తెలుస్తోంది. దాదాపు రూ. 700000 కోట్ల ఆస్తులు ఉన్నాయని సమాచారం.