Ratan Tata: టాటా గ్రూప్ నుంచి ప్రభుత్వ పరమైన ఎయిరిండియాను మళ్లీ టాటాల పట్టులోకి తీసుకురావాలన్నది రతన్ టాటా చిరకాల కోరిక. ఇందుకు అడ్డంకులు ఎదురవడంతో సింగపూర్ ఎయిర్ లైన్స్, మలేషియా ఎయిర్ లైన్స్ తో కలిసి విమానయాన రంగంలోకి ప్రవేశించారు. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు అడ్డంకులు తొలగడంతో 2022లో ఆ సంస్థను మళ్లీ టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. అయితే, ఈ సంస్థ నష్టాల్లో ఉందని.. భారత ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది.
ఆ కోరిక తీరకుండానే...
పీకల్లోతు నష్టాలతో ఉన్న ఎయిరిండియాను కొనేందుకు ఏ ప్రైవేటు సంస్థా ముందుకు రాలేదు. అయినా తమ గ్రూప్ వ్యవస్థాపకుడు జేఆర్డీ టాటా ప్రారంభించిన ఎయిర్ ఇండియాను మళ్లీ తమ ఆధీనంలోకి తేవాలనే ఏకైక లక్ష్యంతోనే ఎయిర్ ఇండియాను రతన్ టాటా కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ సంస్థ అన్ని బాలారిష్టాలను అధిగమిస్తూ పెద్ద ఎత్తున విస్తరణకు సిద్ధమైంది. అయితే, ఇప్పుడే నష్టాల నుంచి ఒడ్డున పడుతూ.. లాభాల దిశగా అడుగులు వేస్తున్న ఎయిర్ ఇండియా పూర్తి లాభాలు చూడకుండానే ఆయన తుది శ్వాస విడిచారు. దీన్ని లాభాల బాటలో పెట్టాలని.. సామాన్యులు కూడా తక్కువ ఖర్చుతో విమానం ఎక్కాలన్నది ఆయన కోరికగా ఉండేది.
తొలి విమాన కంపెనీ...
టాటా సంస్థ మొదట ఒక చిన్న కాటన్ మిల్లుగా ప్రారంభం అయింది. జమ్‌షెడ్జీ టాటా దీనిని స్థాపించారు. 1869లో ప్రారంభమైన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది. అసలు మన దేశంలో మొదటి సారిగా విమానాల కంపెనీని స్టార్ట్ చేసింది టాటాలే. ఇప్పుడు ఎయిర్ ఇండియా గా చెప్పుకుంటున్న ఎయిర్ లైన్స్ మొదట టాటా ఎయిర్ లైన్స్ గా ఉండేది. కానీ రెండో ప్రంపంచ యుద్ధం తరువాత అది ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. ఇదెక్కొట్టే కాదు.. ఇండియాలోనే మొట్ట మొదటి హోటల్ తాజ్ హోటల్ ను స్థాపించింది కూడా టాటాలే.