PV Sindhu : పీవీ సింధు అరుదైన రికార్డు

భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు అరుదైన ఘనత సాధించారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో 500మ్యాచ్‌ల్లో విజయాలు సొంతం చేసుకున్నఆరో క్రీడాకారిణిగా రికార్డు సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ రికార్డు నమోదు చేసిన తొలి భారత షట్లర్‌గా కూడా చరిత్ర సృష్టించింది.

New Update
FotoJet - 2026-01-23T063851.029

PV Sindhu

PV Sindhu : భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు అరుదైన ఘనత సాధించారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో 500 మ్యాచ్‌ల్లో విజయాలు సొంతం చేసుకున్న ఆరో క్రీడాకారిణిగా రికార్డు సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఈ రికార్డు నమోదు చేసిన తొలి భారత షట్లర్‌గా కూడా చరిత్ర సృష్టించింది. ఇండోనేసియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో భాగంగా సింధు ఈ చిరస్మరణీయ విజయంతో క్వార్టర్‌ఫైనల్లో అడుగు పెట్టడం విశేషం. గురువారం ప్రిక్వార్టర్స్‌లో భారత స్టార్‌ 21-19, 21-18తో లైన్‌ హోయ్‌మార్క్‌ (డెన్మార్క్‌)పై గెలుపొందింది. 

కాగా, మహిళల సింగిల్స్‌లో సింధు కంటే ముందు ఇంతానన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌), తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ), అకానె యమగూచి (జపాన్‌), కరోలినా మారిన్‌ (స్పెయిన్‌), పెత్యా నెదెల్చెవా (బల్గేరియా) తదితరులు మాత్రమే 500 విజయాలు నమోదు చేసిన వారిలో ఉన్నారు. ఇక డబుల్స్‌ మ్యాచ్‌లను కూడా జోడీస్తే సింధు ఖాతాలో మొత్తం 516 విజయాలున్నాయి. ఇక పురుషుల సింగిల్స్‌లో మరో స్టార్‌ క్రీడాకారుడు లక్ష్యసేన్‌ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్‌ 21-10, 21-11తో జేసన్‌ గునవాన్‌ (హాంకాంగ్‌)పై విజయం సాధించాడు. కిదాంబి శ్రీకాంత్‌ 11-21, 10-21తో చౌ తీన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓటమి చవి చూశాడు. మహిళల సింగిల్స్‌లో అన్మోల్‌ ఖరబ్‌ 21-16, 6-15 (రిటైర్డ్‌)తో నొజొమి ఒకుహర (జపాన్‌) చేతిలో పరాజయం పాలయింది. పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో హరిహరన్‌- అర్జున్‌ జోడీ 17-21, 21-9, 16-21తో వీ చాంగ్‌- వున్‌ తీ (మలేసియా) జంట చేతిలో ఓడిపోయారు.

Advertisment
తాజా కథనాలు