సీపీఎం సీనియర్ నేత ప్రకాశ్ కారత్‌కు కీలక బాధ్యతలు..

సీపీఎం నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేవరకు పొలిట్ బ్యూరోకు సెంట్రల్ కమిటీకి ఆ పార్టీ నేత ప్రకాశ్‌ కారత్ మధ్యంతర సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పార్టీ సభ్యులు కొత్త సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోనున్నారు.

Prakash karat 2
New Update

సీపీఎం నేత ప్రకాశ్‌ కారత్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. సీపీఎం నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేవరకు పొలిట్ బ్యూరోకు సెంట్రల్ కమిటీకి ఆయన మధ్యంతర సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. ఢిల్లీలో జరిగిన సెంట్రల్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సీతారం ఏచూరి ఆకస్మిక మరణంతో  ప్రస్తుతం సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మధురైలో సీపీఎం 24వ అఖిలభారత మహాసభలు జరగనున్నాయి. ఈ మహాసభల్లో కొత్త సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోనున్నారు.

Also Read: అయిన వారే ఆగం చేస్తున్నారు.. చిన్నారులపై అఘాయిత్యాల కేసుల్లో షాకింగ్ విషయాలు!

CPM Elects Prakash Karat

ఎవరినీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. పొలిట్ బ్యూరోలో ఉంటూ ప్రజాఉద్యమంలో పాల్గొన్న వారు ఈ పదవికి రేసులో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీవీ రాఘవులు, కేరళకు చెందిన బేబీ లేదా విజయ రాఘవన్‌, బెంగాల్‌కు చెందిన నీలోత్పల్‌ బసు, మహారాష్ట్రకు చెందిన అశోక్‌ ధావళే సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రేసులో ఉన్నారు. 

#telugu-news #cpm #sitaram-yechury
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి