PM Modi: ప్రధాని ఫ్యామిలీలోకి కొత్త వ్యక్తి.. క్యూట్ వీడియో వైరల్!

ఢిల్లీలోని లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌ అధికారిక నివాసంలో లేగ దూడ జన్మించినట్లు తెలిపారు ప్రధాని మోదీ. నుదుటిపై కాంతికి చిహ్నంగా ఒక ప్రత్యేకమైన గుర్తుతో పుట్టిన లేగకు ‘దీప్‌జ్యోతి’ అనే పేరు పెట్టారు మోదీ. ప్రత్యేక పూజలు చేసిన ఫొటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

modi
New Update

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ఫ్యామిలీలోకి కొత్త వ్యక్తి వచ్చారంటూ ఓ ఆసక్తికర వీడియోను దేశ ప్రజలతో షేర్ చేసుకున్నారు. ఢిల్లీలోని లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌ లో అధికారిక నివాసం ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇందులో ఓ ఆవు లేగ దూడకు జన్మనిచ్చింది. అయితే ఆ దూడకు నామకరణం చేసిన మోదీ.. సోషల్ మీడియా వేదికగా ఈ శుభసందర్భాన్ని అందరితో పంచుకున్నారు.

ఈ మేరకు లేగదూడ నుదుటిపై కాంతికి చిహ్నంగా ఒక ప్రత్యేకమైన గుర్తు ఉండటం విశేషం. కాగా ఈ విశిష్ట లక్షణాన్ని పురస్కరించుకుని దానికి ‘దీప్‌జ్యోతి’ (Deepjyoti) అని పేరు పెట్టారు మోదీ. అంతేకాదు ఆ లేగదూడకు శాలువా కప్పి ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలో నెట్టింట వైరల్ అవుతుండగా.. లేగదూడను ముద్దాడుతూ ముచ్చటగా కనిపించారు ప్రధాని.

 

#pm-modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe