Free Health Insurence:
దేశంలో 70ఏళ్లకు పైబడి వృద్ధులకు రూ.5లక్షల ఉచిత ఆరోగ్య బీమా పథకం 'ఆయుష్మాన్ భారత్'ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద-ఏఐఐఏలో జరిగిన కార్యక్రమంలో అర్హులైన వారికి 'అయుష్మాన్ భారత్ వయ వందన' కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ, ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం పురోగతి వేగం పుంజుకుంటుందని అన్నారు. "పేద ప్రజల కోసం రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు భరించేలా మా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా సూమారు 4 కోట్ల మంది పేదలు లబ్ధి పొందారు. 70ఏళ్లకు పైబడిన వారిని ఆయుష్మాన్ భారత్ కింద కవర్ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఈరోజు నేరవేర్చాం. ఒకప్పుడు వైద్యం కోసం ఇళ్లు, భూములు, నగలు అమ్మేసేవారు.
ఇక తీవ్రమైన వ్యాధులు వస్తే- దాని చికిత్సకు అయ్యే ఖర్చు విని వణికిపోయేవారు. డబ్బు లేకపోవడం వల్ల వైద్యం చేయించుకోలేని నిస్సహాయత ఉండేది. ఆ నిస్సహాయతలో నా పేద సోదరీమణులను చూడలేకపోయాను. అందుకే అయుష్మాన్ భారత్ పథకం కింద రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని నిర్ణయించాము" అని ప్రధాని మోదీ అన్నారు.
Also Read: Indo-China: అమల్లోకి గస్తీ ఒప్పందం..బలగాల ఉపసంహరణ