BIG BREAKING: లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు బిగ్ షాక్!

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో సోమవారం అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధంతో వాయిదా పడుతూ వచ్చింది. సభలో తమను మాట్లాడనివ్వడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో స్పీకర్‌ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మాసం తీసుకొచ్చేందుకు విపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి.

New Update
Speaker Om Birla

Speaker Om Birla

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో సోమవారం అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధంతో ఉభయ సభలు తరుచూ వాయిదా పడుతూ నడుస్తున్నాయి. సభలో తమను మాట్లాడనివ్వడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మాసం తీసుకొచ్చేందుకు విపక్షాలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ ఓం బిర్లా టార్గెట్‌గా విపక్షాలు పావులు కదుపుతుండటంతో పార్లమెంట్ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విపక్షాలకు తగినంత బలం ఉండటంతో, స్పీకర్‌కు నోటీసు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నోటీసు ఇచ్చిన 14 రోజుల తర్వాత సభలో దీనిపై చర్చ జరగాల్సి ఉంటుంది.

సభలో స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్ష కూటమి సిద్ధమైంది. రాజ్యాంగంలోని 94(సి) అధికరణం ప్రకారం స్పీకర్‌ను తొలగించే ప్రక్రియను చేపట్టాలని విపక్ష సభ్యులు నిర్ణయించారు. సభలో చైనా సరిహద్దు వివాదంపై చర్చ జరుగుతుండగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ఆర్మీ జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే రాసిన పుస్తకంలోని సున్నితమైన అంశాలను రాహుల్ ప్రస్తావించే ప్రయత్నం చేశారు. అయితే, దీనిపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మాట్లాడుతుండగానే ఆయన మైక్ కట్ చేయడంతో విపక్షాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

స్పీకర్ తీరుకు నిరసనగా ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభకు ఆటంకం కలిగిస్తున్నారనే కారణంతో ఏకంగా 8 మంది సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఇది విపక్షాల ఆగ్రహాన్ని మరింత పెంచింది. స్పీకర్ కేవలం అధికార పక్షానికే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష గొంతు నొక్కేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు