Budget 2026: కంటెంట్ క్రియేటర్లకు గుడ్‌న్యూస్.. లక్షల మందికి ఉపాధి.. నిర్మలమ్మ శుభవార్తలు ఇవే!

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026లో కంటెంట్ క్రియేటర్లకు శుభవార్త చెప్పారు. డిజిటల్ యుగంలో దూసుకుపోతున్న యువతకు ఈ బడ్జెట్ ఫుల్ జోష్ ఇస్తోంది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది.

New Update
content creator labs

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026లో కంటెంట్ క్రియేటర్లకు  శుభవార్త చెప్పారు. డిజిటల్ యుగంలో దూసుకుపోతున్న యువతకు ఈ బడ్జెట్ ఫుల్ జోష్ ఇస్తోంది. ముఖ్యంగా యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది.

విద్యాసంస్థల్లో 'క్రియేటర్ ల్యాబ్స్'
రాబోయే తరానికి అవసరమైన డిజిటల్ స్కిల్స్ స్కూల్ నుంచే అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 15,000 సెకండరీ పాఠశాలల్లో, 500 కళాశాలల్లో అత్యాధునిక కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ సహకారంతో ఈ ల్యాబ్‌లను అభివృద్ధి చేస్తారు. దీనివల్ల విద్యార్థులకు వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్,  డిజిటల్ స్టోరీ టెల్లింగ్‌లో ప్రాక్టికల్ శిక్షణ లభిస్తుంది. భారతదేశాన్ని గ్లోబల్ గేమింగ్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు. ఈ రంగంలో రాబోయే కొద్ది కాలంలోనే 10 లక్షల (1 మిలియన్) గేమింగ్ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. గేమింగ్, ఇ-స్పోర్ట్స్ పరిశ్రమను ఒక వ్యవస్థీకృత రంగంగా గుర్తించి, స్టార్టప్‌లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనున్నారు. 2030 నాటికి ఈ రంగంలో దాదాపు 20 లక్షల మంది నిపుణుల అవసరం ఉంటుందని అంచనా వేస్తూ, తదనుగుణంగా శిక్షణా కార్యక్రమాలను విస్తరించనున్నారు.

"భారతీయ యువత సృజనాత్మకతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ బడ్జెట్ ద్వారా మన క్రియేటర్లు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాము." ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

AVGC మిషన్: కొత్త ఒరిజినల్ ఐపీ క్రియేషన్ కోసం భారీ నిధులు.
డిజిటల్ మౌలిక సదుపాయాలు: గ్రామీణ ప్రాంతాల్లో కూడా కంటెంట్ క్రియేటర్లకు హై-స్పీడ్ ఇంటర్నెట్, టెక్నాలజీ అందుబాటులోకి.
నైపుణ్య అభివృద్ధి: ఐటిఐ (ITI) మరియు పాలిటెక్నిక్ కళాశాలల్లో గేమింగ్ డెవలప్‌మెంట్ కోర్సుల ప్రవేశం.

మొత్తానికి, ఈ బడ్జెట్ సాంప్రదాయ ఉద్యోగాల వైపు మాత్రమే కాకుండా, ఆధునిక క్రియేటివ్ ఎకానమీ వైపు యువతను నడిపించేలా ఉంది. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్‌ను కేవలం వినోదం కోసం కాకుండా, ఉపాధి మార్గంగా మార్చుకునేలా ప్రభుత్వం వేసిన ఈ అడుగు యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

Advertisment
తాజా కథనాలు