సల్మాన్ ఇంటి దగ్గర భారీ భద్రత..24/7 పోలీస్ పెట్రోలింగ్

ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిధిఖీ హత్య తర్వాత సల్మాన్‌ ఖాన్‌ ఇంటి ముందు భారీ భద్రతను ఏర్పాటు చేశారు ముంబై పోలీసులు.సల్మాన్‌తో స్నేహం కారణంగానే సిద్ధిఖీని చంపామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చెప్పింది.

Salman Khan
New Update

Hero Salman Khan House: 

మ‌హారాష్ట్ర మాజీ మంత్రి, సల్మాన్ ఖాన్‌ ఫ్రెండ్‌.. బాబా సిద్ధిఖీ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సిద్ధిఖీని హత్య చేసింది తామే అంటూ లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ గతంలోనే అనేక సార్లు సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తామని బెదిరించింది. ఇటీవలే సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు కూడా జరిపారు. అయితే సల్మాన్ ఖాన్ స్నేహితుడు సిద్ధిఖీకి మాత్రం ఎలాంటి బెదిరింపులు లేవు. కానీ త‌మ‌ టార్గెట్‌గా ఉన్న స‌ల్మాన్ ఖాన్‌తో సిద్ధిఖీ క్లోజ్‌‌గా ఉండ‌డమే ఈ హ‌త్యకు దారితీసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఇటీవ‌లే లారెన్స్ బిష్ణోయ్ స‌న్నిహితుడు రోహిత్ గోదారా మాట్లాడుతూ.. స‌ల్మాన్ ఖాన్ స్నేహితుడు త‌మ శ‌త్రువు అన్నారు. రోహిత్ నుంచి స్టేట్‌మెంట్ ఇలా వచ్చిందో లేదో సిద్దిఖీని దారుణంగా చంపేశారు. తనకు ప్రాణహాని ఉందని, వై కేట‌గిరీ భ‌ద్రత కేటాయించాల‌ని పోలీసు ఉన్నతాధికారుల‌ను 15 రోజుల క్రితమే సిద్ధిఖీ కోరిన‌ట్లు తెలిసింది. కానీ ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. 

Also Read: నవంబర్ 13న వాయనాడ్ బై పోల్..బరిలోకి ప్రియాంక

భారీ ఎత్తున నిఘా..

సిద్ధిఖీ హత్య తరువాత నెక్స్ట్ టార్గెట్ సల్మాన్ ఖానే అన్న చర్చ తెగ నడుస్తోంది. దాంతో పాటూ సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఇంతకు ముందు బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు కూడా జరపడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. దీంతో ముంబై పోలీసులు అలెర్ట్ అయ్యారు.   బాంద్రాలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద భద్రతను పెంచారు. భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. దాదాపుగా 60 మంది పోలీసులు 24/7 పెట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో పాటూ ముంబై పోలీసులు ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో కూడిన కూడిన AI- ఎనేబుల్డ్ హై-రిజల్యూషన్ CCTV కెమెరాలను సల్మాన్ ఇంటి చుట్టూ ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు ఇంటి చుట్టుపక్కల తిరిగిన వ్యక్తులను క్యాప్చర్ చేస్తాయి. మూడుసార్ల కంటే ఎక్కువగా క్యాప్చర్ చేయబడితే వార్నింగ్ సిగ్నల్స్ పంపుతాయి. ప్రత్యేక కమాండ్ సెంటర్ రోజంతా ఈ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తోంది. ఇక సల్మాన్ ఖాన్‌కి ప్రస్తుతం వై-ప్లస్ సెక్యూరిటీ కవర్‌ ఉంది. దీంట్లో 8 నుంచి 10 మంది సాయుధ పోలీసులు ఉంటారు. వీరంతా సల్మాన్ ఖాన్ వెంటే ఉంటారు. ప్రతీరోజూ సల్మాన్ ఖాన్ కదలికల్ని స్థానిక పోలీస్ స్టేషన్ సమన్వయం చేస్తుంది. 

Flights: ఎయిర్ ఇండియా మరికొన్ని విమానాలకు బాంబుల బెదిరింపు

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe